కావలసిన పదార్థాలు :
పాలు... రెండు కప్పులు
కోకో పౌడర్... అర టీ.
చాకొలెట్ పౌడర్... ఒక టీ.
పంచదార... ఒకటిన్నర టీ.
కాఫీ... అర టీ.
అలంకరణ కోసం...
చాకొలెట్ బార్ ముక్కలు... రెండు
మీగడ... అర కప్పు
తయారీ విధానం :
పంచదార, కాఫీ, కోకో, చాకొలెట్ పౌడర్లను పాలలో కలిపి గిలకొట్టాలి. ఇందులోనే పాలపొడి వేసి మళ్లీ చిలకాలి. దీన్ని గ్లాస్‌లలోకి ఒంపి మీగడ, చాకొలెట్ బార్ ముక్కలను కలిపితే కోకో చాకొలెట్ మిల్క్ రెడీ అయినట్లే...! వెరైటీగా, స్పెషల్‌గా ఉండే ఈ డ్రింక్‌ను తయారు చేయడం చాలా సులభం కాబట్టి, మీరూ ట్రై చేయండి.