Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెడిటేషన్ అందరూ అలవరుచుకోవాలి : మద్రాసు హైకోర్టు జడ్జి కృపాకరన్

మెడిటేషన్ అందరూ అలవరుచుకోవాలి : మద్రాసు హైకోర్టు జడ్జి కృపాకరన్
, ఆదివారం, 20 మార్చి 2022 (14:58 IST)
చెన్నై మైలాపూర్‌లో నివసించే మెడిటేషన్ గురువు గోడా వేణుగోపాల్ రచించిన "మెడిటేషన్ ఆఫ్ ది గురు" అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మైలాపూర్‌లోని భారతీయ విద్యా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కృపాకరన్ ప్రసంగిస్తూ తమ దైనందిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ఒక భాగంగా చేసుకొని ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆరోగ్యంతో జీవించాలని హితవు పలికారు.‌ 
 
భారతం, భాగవతంతో పాటు తిరుక్కురల్ కూడా అందరూ మరిచిపోతున్నారని, ప్రతిరోజు అర్థం పర్ధం లేని వాట్సాప్ మెసేజ్‌లతో తమ అమూల్య సమయాన్ని వృధా చేసుకోకుండా మెడిటేషన్ అలవాటు చేసుకుని సంతోషంగా జీవించాలని అన్నారు.‌ మరో ముఖ్య అతిథి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వి.పార్థియన్ ప్రసంగిస్తూ ప్రస్తుతం ఏ కార్యక్రమంలో చూసినా అందరూ ఏదో పనుల్లో నిమగ్నమై అనేక, మానసిక ఒత్తిడితో కనిపిస్తున్నారని దానికి పరిష్కార మార్గం మెడిటేషన్ ఒక్కటే అని అన్నారు. 
 
ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉండాలి అని మెడిటేషన్ గురు వేణుగోపాల్ను అభినందించారు. మరో అతిథి, నాట్యం కళాకారిణి ‌పద్మశ్రీ నర్తకి నటరాజ్ ప్రసంగిస్తూ వేణుగోపాల్ రచించిన మెడిటేషన్ పుస్తకం ఆంగ్లంలో ఉన్నదని దానిని అన్ని భాషల్లోకి అనువదించి అందరికీ ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ఇంగ్లీషు రాని మాలాంటి తమిళ మాతృభాష అభిమానులకు సరళంగా అర్థమయ్యేలా చట్టాలను కూడా తమిళంలో అనువదించాలని హైకోర్టు న్యాయమూర్తులను కోరారు.‌
webdunia
 
మరో అతిథి సినీనిర్మాత, దర్శకుడు, సినీ నటులు పిరమిడ్ నటరాజన్ ప్రసంగిస్తూ మెడిటేషన్ చేయడం వల్లనే సూపర్ స్టార్ రజనీకాంత్, భారత ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆహ్లాదంగా కనిపిస్తుంటారని అన్నారు.‌ ఈ పుస్తకం విశ్లేషణ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారిణి గీతారాణి ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి నుండి ఇపుడిపుడే బయటపడుతున్న ప్రజానీకం ఒత్తిళ్ల నుంచి బయటపడాలంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం అని అన్నారు. 
 
ఈ పుస్తకం అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో ఉందని, మెడిటేషన్‌తో భగవంతుని కృపకు సులభంగా మనం చేరుకోవచ్చు అని అన్నారు.‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ దేశం అధ్యక్షులు వి.‌ కృష్ణారావు పుస్తక రచయిత వేణుగోపాల్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా యోగాపై డాక్టరేట్ చేసిన గోడా సుజాత గార్లను పుష్ప గుచ్చంతో సత్కరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడికూర ధర