నీటిపారుదల శాఖ(ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్)లో ఖాలీగా ఉన్న 2,411 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది. వారం రోజుల్లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,111 ఏఈ పోస్టలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండవ దశలో భాగంగా మిగిలిన 1,300 పోస్టులను ఈ ఏడాది లోపు భర్తీ చేయటానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో వారం రోజుల్లో 1,111 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ధరకాస్తులను ఆహ్వానించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
ఆరు జోన్లలో భర్తీ చేయనున్న ఏఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జోన్ 1 - 128 పోస్టులు, జోన్ 2 - 122 పోస్టులు, జోన్ 3 - 174 పోస్టులు, జోన్ 4 - 200 పోస్టులు, జోన్ 5 - 262 పోస్టులు, జోన్ 6 - 225 పోస్టులుగా ఉంది.