టెన్త్ ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయి!
పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖా మంత్రి మాణిక్య వరప్రసాదరావు ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో 81.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత యేడాది కంటే ఈ దఫా మూడు శాతం పెరిగింది. ఈ యేడాది ఫలితాలను తొలిసారి గ్రేడింగ్ విధానంలో ప్రకటించడం గమనార్హం. పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఈ పరీక్షలకు మొత్తం 13,36,982 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 82 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 81గా ఉంది. ఇకపోతే.. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్ జిల్లా వరుసగా రెండో సారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో స్థానంలో కరీంనగర్ జిల్లా 90 శాతంతోనూ, చివరి స్థానంలో హైదరాబాద్ 71.79 శాతంలో ఉంది. అలాగే, అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని మంత్రి మాణిక్య వరప్రసాదరావు వెల్లడించారు. ఈ ఫలితాల కోసం రిజల్ట్స్ డాట్ వెబ్‌దునియా డాట్ కామ్‌లో చూడొచ్చు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.