Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాత్రలను కడగడంలో లింగసమానత్వం కోసం Vim What A Player ప్రచారం, సెహ్వాగ్ చూడండి

పాత్రలను కడగడంలో లింగసమానత్వం కోసం Vim What A Player ప్రచారం, సెహ్వాగ్ చూడండి
, శుక్రవారం, 6 నవంబరు 2020 (22:48 IST)
డిష్‌వాషింగ్‌ (వంటపాత్రలను శుభ్రపరచడం) విభాగపు సృష్టికర్త మరియు ప్రస్తుత మార్కెట్‌ అగ్రగామి, హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌కు చెందిన విమ్‌ ఇప్పుడు వంటపాత్రలను కడగడంలో మూసధోరణిని పోగొట్టడమే లక్ష్యంగా #విమ్‌ వాట్‌ ఏ ప్లేయర్‌ ప్రచారం ప్రారంభించింది. కోవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి పనులలో పురుషులు సైతం పాలుపంచుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ బ్రాండ్‌ ఇప్పుడు అనాదిగా వస్తున్న మూసధోరణులను బద్ధలుకొట్టే అవకాశాన్ని ఈ ప్రచారం ద్వారా వినియోగించుకుంటుంది.
 
ఇంటి పనులలో చురుకుగా సహాయం చేస్తున్న పురుషులు, వంటపాత్రలను కడగడంలో ఉన్న సమస్యలను సైతం నూతనంగా కనుగొన్నారు. ఈ ప్రచారం ద్వారా ఉత్పత్తి యొక్క పనితీరు ప్రయోజనాలను తెలుపడంతో పాటుగా వంటపాత్రలను కడగడాన్ని ఇది ఏ విధంగా సులభతరం చేస్తుందో తెలిపారు. పురుషుల నడుమ ఈ సందేశాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, ఈ ప్రచారాన్ని ప్రస్తుత  ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం ప్రసారం చేయనున్నారు. ఈ బ్రాండ్‌ ఇప్పుడు సుప్రసిద్ధ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ను ఈ మార్గదర్శక ప్రచారంలో కథానాయకునిగా ఎంచుకుంది.
 
విమ్‌ లిక్విడ్‌తో ఎలాంటి వంటపాత్రలను కడిగే సవాల్‌ అయినా అధిగమించడం ఎంత సులభమో ఆయన తెలుపుతారు. ఈ ప్రచారానికి ఐపీఎల్‌ ఫ్లేవర్‌ను జోడిస్తూ సెహ్వాగ్‌ వంటపాత్రలను కడుగుతుంటే సుప్రసిద్ధ ఐపీఎల్‌ కామెంటేటర్‌ డానీ మారిసన్‌ క్రికెట్‌ కామెంటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటారు. ప్రాపంచిక డిష్‌వాషింగ్‌ మీద క్రికెట్‌ వ్యాఖ్యానం సృజనాత్మక సన్నివేశాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఈ టీవీసీ ప్రభావవంతంగా బ్రాండ్‌ యొక్క స్థానాన్ని సమర్ధవంతంగా వెల్లడిస్తుంది.
 
ఈ ప్రచారం గురించి ప్రభ నరసింహన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ వీపీ, హోమ్‌ కేర్‌, హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో వంటపాత్రలను శుభ్రచేయడమనేది నిత్యం చేయాల్సిన పని మాత్రమే కాదు, సంప్రదాయంగా దీనిని కుటుంబంలో అసమానంగా పంపిణీ చేశారు. అతి కొద్ది గృహాలలో ఈ పని చేసేందుకు పనివారిని నియమించుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తు చాలా ఇళ్లలో ఇది గృహిణి విధిగానే కనిపిస్తుంది. అయితే ఈ అంశం కొద్దిగా మారుతుంది.
 
మా అధ్యయనం వెల్లడించేదాని ప్రకారం ప్రస్తుత మహమ్మారి మరియు భారతదేశ వ్యాప్తంగా తదనంతర లాక్‌డౌన్స్‌ వంటివి లింగ సమానత్వంకు తగిన తోడ్పాటునందించడంతో పాటుగా ఈ తరహా విధిలలో పురుషులు పాల్గొనడమూ కనిపించింది. ఈ పరిజ్ఞానంతో పాటుగా మా అంతర్జాతీయ #అన్‌స్టీరియోటైప్‌ ఉద్యమానికి అనుగుణంగా #విమ్‌ వాట్‌ఏ ప్లేయర్‌ ప్రచారం ప్రారంభించాం. ఈ పరిశ్రమలో అగ్రగామిగా, సానుకూల సాంస్కృతిక మార్పుకు తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా మా ప్రకటనల ద్వారా ప్రజలతో అత్యుత్తమ సంబంధాలను ఏర్పరుచుకోనున్నాం’’ అని అన్నారు.
 
ఈ టీవీసీ గురించి సునెత్రో లహిరి, అసోసియేట్‌ వీపీ-క్రియేటివ్‌, గ్లిచ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఇంటిపనుల పంపిణీ విషయానికి వస్తే, లింగ సమానత్వం యొక్క పూర్తి కొరత గురించి ఎక్కువ మంది గ్రహించడం లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు కలిగిన సానుకూల అంశాలలో ఒకటి. సృజనాత్మక కోణంలో చూసినప్పుడు, మా లక్ష్యం కేవలం ఓ జీవిత నైపుణ్యం ప్రదర్శించినందుకు ప్రశంసలు అందుకునేలా ఓ కథనాన్ని సృష్టించడం కాదు...  బదులుగా, ఈ కార్యాచరణను సాధారణీకరించాలనుకున్నాం. సెహ్వాగ్‌ కన్నా గొప్పగా దీనిని ముందుకు ఎవరు తీసుకువెళ్లగలరు’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్చితార్థం చేసుకున్న యువకుడి నుంచి వాట్సప్ కాల్, అంతే... గొంతు నులిమేసాడు