Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశపు ఫ్యాషన్‌ నిపుణునిగా మింత్రాను సమర్పిస్తున్న విజయ్‌ దేవరకొండ

Advertiesment
భారతదేశపు ఫ్యాషన్‌ నిపుణునిగా మింత్రాను సమర్పిస్తున్న విజయ్‌ దేవరకొండ
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:14 IST)
తమ తాజా బ్రాండ్‌ ప్రచారాన్ని తమ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌ విజయ్‌ దేవరకొండతో విడుదల చేస్తున్నట్లు మింత్రా వెల్లడించింది. ఈ ప్రకటన ద్వారా భారతదేశపు ఫ్యాషన్‌ నిపుణునిగా బ్రాండ్‌ను నిలుపనున్నారు. భారీ దేశ వ్యాప్తంగా తారలతో కూడిన బ్రాండ్‌ ప్రచారం చేయాలనే లక్ష్యంలో, ఈ ప్రకటన ఓ భాగం. ఈ లక్ష్యంలో భాగంగా సినిమా రంగంలోని నటులు, వినోదం మరియు ఎక్కువమంది అభిమానించే ఫ్యాషన్‌ ఐకాన్‌లుగా గుర్తింపు పొందిన ఫ్యాషన్‌ రంగ నిపుణులతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భారతదేశపు ఓ ఈ-కామర్స్‌ బ్రాండ్‌ కోసం అతిపెద్ద సెలబ్రిటీ ఆధారిత ప్రచారాలలో ఒకటిగా దీనిని నిలుపనున్నారు.
 
విజయ్‌ యొక్క అసాధారణ ప్రజాదరణతో పాటుగా విభిన్న భాషలలో ఆయన సాధించిన విజయాలు మరియు కష్టపడకుండానే  అత్యంత ఆకర్షణీయంగా కనబడే ఆయన సామర్థ్యానికి తోడు ఆయన ఆకర్షణీయమైన వైఖరి కారణంగా ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. ఈ భాగస్వామ్యం, ఖచ్చితంగా వినియోగదారులు తమ అభిమాన నటుని వార్డ్‌రోబ్‌ను మింత్రా పై మరింతగా వెదికేందుకు తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా విజయ్‌కు ఉన్న అభిమానగణం, ఇప్పుడు ప్రీమియం  ప్రాధాన్యతా ఫ్యాషన్‌ కేంద్రంగా మింత్రా స్థానాన్ని మరింత శక్తివంతంగా మార్చడంతో పాటుగా బ్రాండ్‌కు అదనపు ప్రాముఖ్యతను సైతం తీసుకువస్తుంది.
 
మింత్రా ఇప్పుడు మెగా బ్రాండ్‌ ప్రచారాన్ని పలు సినీ రంగాలకు చెందిన తాగారణంతో  కలిపి రూపొందించింది. దీనిలో అమితాదరణ కలిగిన సెలబ్రిటీలు  కనిపించనున్నారు. తమ నటనా చాతుర్యం, ఫ్యాషన్‌ శైలి కారణంగా ఎక్కువ మంది ఈ తారలను అభిమానిస్తుండటంతో పాటుగా ఆరాధిస్తున్నారు. మింత్రా ఇప్పుడు ఈ తారలతో  తమ అతిపెద్ద బ్రాండ్‌ కమర్షియల్స్‌ విడుదల చేయడానికి సిద్ధమైంది.
 
మింత్రాతో ఈ భాగస్వామ్యం మరియు నూతన ప్రచార చిత్రం గురించి సినీ నటుడు విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ‘‘నాతో సహా నేటి యువత అంతా కూడా ప్రయోగాలు చేయాలనుకుంటుంది. ఫ్యాషన్‌కు సంబంధించి సంప్రదాయ నిబంధనలను అతిక్రమించాలని కోరుకుంటుంది. మింత్రాతో నా భాగస్వామ్యం నా ఈ అభిరుచికి అనుగుణంగా ఉంటుంది. ప్రజల కోసం ఫ్యాషన్‌ను ప్రజాస్వామ్యీకరించడం కోసం నేను వారికి సహకరించాలనుకుంటున్నాను. ఈ బ్రాండ్‌ కోసం ప్రచారకర్తగా నిలువడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు.
 
ఈ బ్రాండ్‌ ప్రచారం గురించి మింత్రా సీఎంఓ హరీష్‌ నారాయణన్‌ మాట్లాడుతూ, ‘‘తన ప్రత్యేకమైన శైలి, వైఖరి కారణంగా తన అభిమానులతో బాగా దగ్గర కావడంతో పాటుగా వారి నడుమ ప్రతిధ్వనిస్తూ ఒక సినిమా శక్తిగా గుర్తించబడ్డారు. భారతదేశంలో అధికశాతం మంది యువత, సినిమా మరియు వినోదం పట్ల విపరీతంగా మొగ్గు చూపుతుంది మరియు ప్రజల ఫ్యాషన్‌ ప్రాధాన్యతలు, ఆకాంక్షలపై బలీయమైన ప్రభావాన్ని విజయ్‌ చూపుతారు. ఈ కారణం చేతనే మింత్రా బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఖచ్చితమైన ఎంపికగా ఆయన నిలిచారు. దేశంలో ఈ తరహాలో సెలబ్రిటీల నేతృత్వంలో నిర్వహిస్తున్న మార్కెటింగ్‌ ప్రచారం కోసం మింత్రా బ్యాండ్‌వాగన్‌కు విజయ్‌ను స్వాగతించడం పట్ల మేము సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
 
మింత్రా ఇప్పుడు సమగ్రమైన విధానాన్ని అమలు చేస్తుంది. టీవీ, డిజిటల్‌, సామాజిక మాధ్యమ వేదికలపై ఆధారపడి ఈ ప్రచార ప్రకటన చిత్రాన్ని రెండు రాష్ట్రాలలో ప్రసారం చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రీ ఫైర్, పబ్‌జి గేమ్స్‌ను నిషేధించాలి.. ప్రధానికి న్యాయమూర్తి లేఖ