ఎల్‌ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండడంతో భారత్‌లో కంపెనీలు టీవీల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎల్‌జీ కంపెనీ ధరలను పెంచగా, ప్యానసోనిక్, హాయెర్, థామ్సన్ తో పాటు పలు బ్రాండ్లు వచ్చే నెల నుంచి ధరలు పెంచడానికి సిద్ధమైనట్లు సమాచారం.
అంతర్జాతీయంగా ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తామూ టీవీ ధరలు పెంచక తప్పట్లేదని ప్యానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా సీఈవో మనీశ్ శర్మ మీడియాకు చెప్పారు. ఈ ధరలు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని వివరించారు.
హాయెర్ అప్లయెన్సెస్ ప్రతినిధులు కూడా ఈ విషయాన్నే తెలిపారు. దేశంలో 32 అంగుళాల టీవీలు అత్యధికంగా అమ్ముడుపోతాయి. వీటి ధరలు రూ.5,000 నుంచి రూ. 6,000 మధ్య పెరిగే అవకాశం ఉంది. టీవీల ధరలు పెరుగుతాయని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
కాగా, చైనా సంస్థలే ఓపెన్ సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా.
ఎల్‌ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి.