Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్‌ఎఫ్‌ఓ ఆఫరింగ్స్‌ను విడుదల చేసిన టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Advertiesment
Cash
, బుధవారం, 29 మార్చి 2023 (19:26 IST)
టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా ఏఐఏ) ఇప్పుడు ప్రొటెక్ట్‌ యువర్‌ ఫ్యూచర్‌ అంటూ ఎన్‌ఎఫ్‌ఓలను విడుదల చేసింది. అవి సస్టెయినబల్‌ ఈక్విటీ ఫండ్‌ ఒకటి కాగా మరొకటి డైనమిక్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌. యూనిట్‌కు 10 రూపాయల ఎన్‌ఏవీ వద్ద ఇవి లభ్యమవుతాయి. దీర్ఘకాలంలో మూలధన వృద్ధిని టాటా ఏఐఏ యొక్క సస్టెయినబిలిటీ ఈక్విటీ ఫండ్‌ చేస్తుంది. ఇది ప్రధానంగా సస్టెయినబల్‌ లేదా పర్యావరణ, సామాజిక, పరిపాలన అనుకూల ప్రక్రియల రంగాల్లోని కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ 80-100% ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్లను ఈఎస్‌జీ ప్రమాణాలు అనుసరిస్తున్న సంస్ధలలో పెడుతుంది.
 
టాటా ఏఐఏ డైనమిక్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ప్రధానంగా అత్యున్నత, స్థిరమైన రాబడులను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఫండ్‌ ప్రధానంగా తమ పెట్టుబడులను ఈక్విటీ, డెబ్ట్‌ ఆధారిత మార్కెట్‌లలో పెడుతుంది. ఈ రెండు ఎన్‌ఎఫ్‌ఓలలో పెట్టుబడులు టాటా ఏఐఏ యొక్క యులిప్‌ ఆఫరింగ్స్‌ అయిన ఫార్చ్యూన్‌ ప్రో, వెల్త్‌ ప్రో, ఫార్చ్యూన్‌ మాగ్జిమా, వెల్త్‌ మాగ్జిమా ద్వారా పెడుతుంది.
 
టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ) మరియు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్షద్‌ పాటిల్‌ మాట్లాడుతూ, ‘‘అనిశ్చితి పరిస్ధితిలలో మన భవిష్యత్‌ను కాపాడుకోవడం అత్యంత కీలకం. అదే సమయంలో జరుగుతున్న నగరీకరణ చూపుతున్న ఋణాత్మక ప్రభావాల నుంచి మన భూగోళాన్ని కాపాడుకోవాల్సి ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వినూత్నమైన ఎన్‌ఎఫ్‌ఓలతో వచ్చాము. ఇవి మదుపరులకు తగిన రక్షణ అందిస్తూనే, మన భూగోళ భవిష్యత్‌కూ తోడ్పడతాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశపు మొట్టమొదటి సూపర్‌ఫుడ్‌ బ్రాండ్‌ నరిష్‌ యులో పెట్టుబడులు పెట్టిన సమంత రూత్‌ ప్రభు