Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సాల్వ్ ఫర్ టుమారో 2024' కోసం విజేతలను ప్రకటించిన సామ్‌సంగ్ ఇండియా

Winners for Solve for Tomorrow 2024

ఐవీఆర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (22:31 IST)
సామ్‌సంగ్ తమ ప్రతిష్టాత్మక జాతీయ విద్య, ఆవిష్కరణల పోటీ అయిన ‘సాల్వ్ ఫర్ టుమారో 2024’ యొక్క 3వ ఎడిషన్‌లో గెలుపొందిన జట్లను ప్రకటించింది. పలు విభాగాలలో ‘ఎకో టెక్’ ఇన్నోవేటర్, మెటల్‌ బృందాలను విజేతలుగా సామ్‌సంగ్ ఇండియా ప్రకటించింది. అస్సాంలోని గోలాఘాట్‌కు చెందిన ఎకో టెక్ ఇన్నోవేటర్ స్కూల్ ట్రాక్‌లో కమ్యూనిటీ ఛాంపియన్‌గా నిలవగా కర్ణాటకలోని ఉడిపికి చెందిన ‘మెటల్’ యూత్ ట్రాక్‌లో ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్‌గా ప్రకటించబడింది, ఇది ప్రధాన భారతీయ నగరాల ఆవల ప్రోగ్రామ్ యొక్క పరిధిని ప్రదర్శిస్తుంది.
 
కాలుష్య రహిత త్రాగునీటికి సమానమైన అవకాశాలను గురించి ఒక ఆలోచనను ఎకో టెక్ ఇన్నోవేటర్ అభివృద్ధి చేసింది, ప్రోటోటైప్ అడ్వాన్స్‌మెంట్ కోసం రూ. 25 లక్షల సీడ్ గ్రాంట్‌ను అందుకుంది. భూగర్భ జలాల నుండి ఆర్సెనిక్‌ను తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేసిన మెటల్, ఐఐటి-ఢిల్లీలో ఇంక్యుబేషన్ కోసం రూ. 50 లక్షల గ్రాంట్‌ను అందుకుంది. సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ ఈ జట్లకు సర్టిఫికెట్లు, ట్రోఫీలను ప్రదానం చేశారు.
 
అదనంగా, 'కమ్యూనిటీ ఛాంపియన్' పాఠశాల విద్యలో సహాయం చేయడానికి, సమస్యను పరిష్కరించే ఆలోచనను ప్రోత్సహించడానికి స్మార్ట్ డిస్ప్లే ఫ్లిప్ 75", ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, 10 గెలాక్సీ ట్యాబ్ ఎస్10+తో సహా సామ్‌సంగ్ ఉత్పత్తులను అందుకుంటుంది. అదేవిధంగా, సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ‘ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్’ కళాశాల స్మార్ట్ డిస్‌ప్లే ఫ్లిప్ 75”, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, 10 గెలాక్సీ బుక్ 4 ప్రో ల్యాప్‌టాప్‌లను అందుకుంటుంది.
 
ఇదిలా ఉంటే 10 జట్లూ ఒక్కొక్కటి రూ. 1 లక్ష అందుకోగా, సభ్యులందరూ సర్టిఫికేట్‌లను అందుకున్నారు. అదనంగా, స్కూల్ ట్రాక్ పార్టిసిపెంట్‌లు గెలాక్సీ వాచ్ అల్ట్రాని అందుకున్నారు. యూత్ ట్రాక్ పార్టిసిపెంట్‌లు గెలాక్సీ జెడ్ ఫ్లిప్6ని అందుకున్నారు. ఫ్లాగ్‌షిప్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్, సామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో, నిజ జీవిత సమస్యలను పరిష్కరించేందుకు, వారి వినూత్న ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి దేశంలోని యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
"సామ్‌సంగ్ వద్ద, ఈ సంవత్సరం 'సాల్వ్ ఫర్ టుమారో' ఎడిషన్‌లో పాల్గొన్న వారందరూ ప్రదర్శించిన ఆవిష్కరణ, సృజనాత్మకత గురించి మేము  గర్విస్తున్నాము. మా ఫ్లాగ్‌షిప్ సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా, తమ కమ్యూనిటీలు, పర్యావరణంలో అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సాధనాలు, మార్గదర్శకత్వం, అవకాశాలను అందించడం ద్వారా యువతను శక్తివంతం చేయడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎకో టెక్ ఇన్నోవేటర్, మెటల్ యొక్క విజయాలు సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించగల తదుపరి తరం యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ యువ ఆవిష్కర్తల ఆలోచనలకు జీవం పోసి, శాశ్వతమైన మార్పు తీసుకురావాలని మేము ఎదురుచూస్తున్నాము” అని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ మరియు సీఈఓ జెబి పార్క్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెఎల్‌హెచ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాంకేతిక నిర్వహణ శ్రేష్ఠత- సాంస్కృతిక వైభవం