Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాటా సన్స్ ఛైర్మన్ రేస్‌లో తెలుగోడు.. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు?

టాటా సన్స్ ఛైర్మన్ రేసులో తెలుగోడు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఆయన పేరు ఎస్.రామదురై. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రి హోదాతో నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్

టాటా సన్స్ ఛైర్మన్ రేస్‌లో తెలుగోడు.. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు?
, బుధవారం, 2 నవంబరు 2016 (12:19 IST)
టాటా సన్స్ ఛైర్మన్ రేసులో తెలుగోడు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఆయన పేరు ఎస్.రామదురై. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రి హోదాతో నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయన హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం మార్కెట్‌ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
 
టీసీఎస్ సీఈఓగా, వైస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన సుబ్రమణియన్‌ రామదురైని రతన్‌టాటాకు సన్నిహితుల్లో ఒకరిగా చెబుతారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ పదవితో పాటు నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సారధ్య బాధ్యతలకు కూడా రామదురై రాజీనామా చేశారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబరు ఆఖరువారంలో ఆరోగ్య కారణాలను పేర్కొంటూ జంట పదవులకు రామదురై రాజీనామా చేశారని, ప్రధాని కార్యాలయం రాజీనామాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని తెలిసింది.
 
టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించిన నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌పై భారీ ఎత్తున స్పెక్యులేషన్‌ సాగుతోంది. ఈ సందర్భంగా రతన్‌టాటా సన్నిహితుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రతన్‌ సవతి సోదరుడు నోయెల్‌ టాటా పేరు కూడా మీడియాలో నలుగుతోంది. 
 
తమిళనాడులో స్థిరపడిన తెలుగుకుటుంబాలకు చెందిన రామదురై 1945లో నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రిగారు తమిళనాడు అకౌంటెంట్‌ జనరల్‌గా పనిచేశారు. రామదురై సమర్ధతపై రతన్‌టాటాకు చాలా విశ్వాసం. సుదీర్ఘకాలం పాటు టాటా గ్రూప్‌తో ఉండటం వల్ల సంస్థ పనిసంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల ముందే.. గర్భంగా ఉన్న ప్రేయసిపై రేప్: ఆపై రాడ్‌తో కొట్టి చంపేశాడు..