Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ

Advertiesment
తెలుగు రాష్ట్రాల్లోనూ జియో మార్ట్.. ఉచితంగా డోర్ డెలివరీ
, సోమవారం, 20 జులై 2020 (19:22 IST)
Jio Mart
జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా వినియోగదారులకు కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపుగా 200 పట్టణాల్లో జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ఈ యాప్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని, జియో సేల్స్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. వినియోగదారులు జియోమార్ట్‌ యాప్ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. నిత్యావసరాలుతో పాటుగా పళ్లు, కూరగాయలు, కూల్ డ్రింకులు ఇతర సామగ్రిని మార్ట్‌లో అందుబాటులో ఉంచినట్లు సంస్థ పేర్కొంది. 
 
ముఖ్యంగా ఎంఆర్పీ కంటే తాము కనీసం ఐదు శాతం రాయితీ ఇస్తామని జియో మార్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినా ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తారు. పేటీఎం, మోబిక్విక్ ద్వారా పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా, ఎన్నో.. మరెన్నో ఆఫర్లు వినియోగదారుడు దీనిద్వారా పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రులుగా 'ఆ ఇద్దరు'??