Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో ప్రైమ్.. జియో కిరాణా స్టోర్స్ వచ్చేసింది.. ఆఫర్లు అదుర్స్

Advertiesment
జియో ప్రైమ్.. జియో కిరాణా స్టోర్స్ వచ్చేసింది.. ఆఫర్లు అదుర్స్
, బుధవారం, 17 జులై 2019 (15:45 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం కిరాణా వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ పండ్లు, కూరగాయలు, కిరణా వ్యాపారుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గత 2018వ సంవత్సరం రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ.. జియో ఆఫ్ లైన్‌ గురించి మాట్లాడారు.
 
ప్రస్తుతం ఈ స్పీచ్ ప్రస్తుతం రిలయన్స్ కిరాణా స్టోర్స్ పెట్టే స్థాయికి చేరుకుంది. అవును.. కిరణా స్టోర్ అనేది హై బ్రిడ్ ఆన్ లైన్ టు ఆఫ్ లైన్ ఫ్లాట్ ఫామ్ (Hybrid Online-to-Offline platform) అని పిలువబడుతోంది. 
 
ఈ పథకం ద్వారా చిన్న తరహా కిరాణా షాపులు వారికి, కూరగాయల దుకాణాల వారికి.. ఇంకా పండ్ల వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారులు కూడా జియో కిరణా స్టోర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవచ్చు. ఈ స్టోర్.. మై జియో మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానం చేయబడింది. అలా అనుసంధానం చేయడం ద్వారా జియో వినియోగదారులకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ద్వారా పలు వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. 
webdunia
 
ఇప్పటికే ఈ పథకం ముంబై, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ట్రయల్ కోసం అమలులోకి వచ్చింది. ఇంకా ఈ ఆఫర్లన్నీ జియో ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని జియో సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు చుట్టూ బిగుస్తున్న సీబీఐ ఉచ్చు? 'దేవధరా'... ఇదేనా మీ మాటల మర్మం!