గ్రామీణ ప్రాంతాల్లో కరెన్సీ వర్షం... 40 శాతం నోట్లు గ్రామీణ ప్రాంత బ్యాంకులకే
నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతం నోట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపాల
నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతం నోట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపాలని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
నోట్ల రద్దును ప్రకటించి 50 రోజులు గడిచినా కొన్ని చోట్ల నగదు కొరత సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. వారానికి రూ.24 వేలు విత్‌డ్రా పరిమితిని కూడా బ్యాంకులు ఎత్తివేయడంలేదు. మరోపక్క ఆశించిన స్థాయిలో కొత్త నోట్లు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ మేరకు కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం కష్టాలు తీర్చడం లేదు.
దీంతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 40 శాతం నోట్లను పంపడం ద్వారా నగదు కొరత సమస్యకు ఉపశమనం లభిస్తుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు చెస్ట్‌లను ఆదేశించింది. అంతేకాకుండా రూ.100 నోటు కన్నా తక్కువ నిల్వ ఉన్న నోట్లను సైతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని సూచించింది.
‘గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖలకు కొత్త నోట్లను పంపాలని బ్యాంకులు తమ చెస్ట్‌లకు ఆదేశాలివ్వాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఏంలు, పోస్టాఫీస్‌లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ఆర్‌బీఐ పేర్కొంది.