Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దావూద్‌తో 'మాణిక్ చంద్' ధరివాల్, 'గోవా' జోషిలకు లింకులున్నాయ్ : సీబీఐ సంచలన ప్రకటన

ప్రముఖ గుట్కా 'మాణిక్ చంద్' బ్రాండ్ వ్యాపారవేత్త రసిక్ లాల్ ధరివాల్, గోవా బ్రాండ్ గుట్కా వ్యాపారి జగ్దీష్ ప్రసాద్ జోషీలకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలకు లింకులు ఉన్నట్టు సీబీఐ సంచలన ప్రకటనచేసింది. దావూ

Advertiesment
Rasiklal Dhariwal
, బుధవారం, 5 అక్టోబరు 2016 (13:58 IST)
ప్రముఖ గుట్కా 'మాణిక్ చంద్' బ్రాండ్ వ్యాపారవేత్త రసిక్ లాల్ ధరివాల్, గోవా బ్రాండ్ గుట్కా వ్యాపారి జగ్దీష్ ప్రసాద్ జోషీలకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలకు లింకులు ఉన్నట్టు సీబీఐ సంచలన ప్రకటనచేసింది. దావూద్‌తో 'పరస్పర ప్రయోజన బంధం' నడిపారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంచలన ప్రకటన చేసింది. 
 
ఇదే అంశంపై దాదాపు 10 సంవత్సరాల పాటు వీరి కదలికలపై నిఘా పెట్టి, దావూద్‌తో వీరి బంధాన్ని వెలికి తీసినట్టు పేర్కొంటూ ఈ మేరకు చార్జ్‌షీట్‌‌ను ఫైల్ చేసింది. పాకిస్థాన్‌లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఓ గుట్కా ఫ్యాక్టరీని పెట్టడానికి వీరు సహకరించి ధన ప్రయోజనం పొందారని తెలిపింది. 
 
ఇదే చార్జ్‌షీట్‌లో దావూద్ పేరును నిందితుల్లో ఒకడిగా చేర్చిన సీబీఐ, ఆయన మేనల్లుడు అబ్దుల్ హమీద్ అంతులే, దావూద్ అనుచరుడు సలీమ్ మొహమ్మద్ గుహాస్ షేక్ పేర్లనూ చేర్చింది. వాస్తవానికి 2004లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ధరివాల్, జోషిల పేర్లు లేవు. ఆపై విచారణలో వీరి ప్రమేయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీం కేసు.. త్వరలో రాజకీయ నేతలకు సిట్ నోటీసులు... అరెస్టులు తప్పవా?