భోపాల్ నుంచి శనివారం ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో రోహిత్ రాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ప్రయాణించాడు. రోహిత్‌కు ఎయిర్ ఇండియా ఆహారం సరఫరా చేసింది. ఓ ప్యాక్‌లో ఇడ్లీ, సాంబార్, వడను అందజేసింది.
ఇడ్లీ, సాంబార్‌ను తింటూ వుండగా.. అందులో బొద్దింక వుండటాన్ని గమనించి షాక్ అయ్యాడు. ఈ వ్యవహారంపై రోహిత్ ఫిర్యాదు చేసినా ఎయిర్ ఇండియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఉన్నతాధికారికి రోహిత్ లేఖ రాశాడు.
అయినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. చివరికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. ఎయిర్ ఇండియా ఆహారంలో బొద్దింక అంటూ రాశాడు. ఫోటోలను పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో రోహిత్ చేసిన పోస్టు వైరలై కూర్చుంది. దీంతో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజేంద్ర మల్హోత్రా రోహిత్‌తో మాట్లాడారు.
రోహిత్ పంపిన లేఖ తనకు అందలేదని.. ఈ వ్యవహారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి తాను చింతిస్తున్నానని.. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని రాజేంద్ర మల్హోత్రా చెప్పుకొచ్చారు.