Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇతర రాష్ట్రాలలో జెఈఈ, నీట్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఓయో ప్రత్యేక రాయితీలు

Advertiesment
ఇతర రాష్ట్రాలలో జెఈఈ, నీట్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఓయో ప్రత్యేక రాయితీలు
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:20 IST)
భారత ప్రభుత్వ ప్రకటననుసరించి జెఈఈ-మెయిన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 01, 2020వ తేదీ నుంచి జరుగుతున్నాయి. రాబోయే వారాలలో, నీట్‌ 2020 మరియు ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు షెడ్యూల్‌ చేయడం జరిగింది.
 
విద్యా మంత్రిత్వ శాఖతో పాటుగా స్థానిక ప్రభుత్వ అధికారులకు తమ మద్దతును విస్తరించే క్రమంలో, ప్రపంచంలో అగ్రశ్రేణి ఆతిథ్యరంగ గొలుసుకట్టు సంస్థ ఓయో ఇప్పుడు తమ యాప్‌ మరియు వెబ్‌సైట్‌పై జాతీయ ప్రవేశ పరీక్షలతో పాటుగా పలు రాష్ట్రాల పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. తల్లిదండ్రులు, గార్డియన్స్‌ మరియు విద్యార్థులకు మరింతగా మద్దతునందించడంతో పాటుగా సౌకర్యవంతమైన బుకింగ్‌ను సురక్షితమైన మరియు నాణ్యమైన వసతితో అందించడానికి ఓయో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ-మెయిల్‌ హెల్ప్‌లైన్‌ students_stay ఎట్ ఓయో రూమ్స్ డాట్ కామ్ సైతం ప్రారంభించింది.
 
కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న పలు సంక్షోభాలు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి కృషి చేస్తున్న విస్తృతస్థాయి సమాజానికి మద్దతునందించేందుకు ఓయో చేపట్టిన కార్యక్రమాలలో ఇది ఓ భాగం. గత కొద్ది నెలలుగా, ఈ ఆతిథ్యరంగ గొలుసుకట్టు సంస్థ అంతర్జాతీయ పర్యాటకులకు మద్దతునందించడంతో పాటుగా పలు విదేశీ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యకలాపాల వల్ల వందే భారత్‌ మిషన్‌లో భాగంగా వస్తున్న భారతీయులకు సైతం వసతిని అందించింది.
 
మహమ్మారి వేళ, ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంలో సహాయపడేందుకు భారతదేశం అత్యంత జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తుంది.  దాదాపు 24 లక్షల మంది ఔత్సాహిక విద్యార్థులు జెఈఈ-మెయిన్‌ మరియు నీట్‌ 2020 పరీక్షల కోసం ఇప్పుడు సిద్ధమవుతున్నారు. వీరిలో చాలామంది చిన్న పట్టణాలు మరియు నగరాల నుంచి ఉన్నారు.  ఈ విద్యార్థుల ప్రయత్నాలకు మద్దతునందించడంలో భాగంగా భారత ప్రభుత్వ విద్యా శాఖామంత్రి శ్రీ రమేష్‌ పోఖియాల్‌ నిశాంక్‌ స్థానిక ప్రభుత్వ అధికారులను ఈ ఔత్సాహికులకు మద్దతునందించాల్సిందిగా అభ్యర్ధించారు.
 
విద్యార్థుల సంక్షేమం మరియు వారి తల్లిదండ్రులు, గార్డియన్‌ల ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓయో ఇప్పుడు ఔత్సాహిక భారతీయ యువ విద్యార్థులకు అవసరమైన వసతి సౌకర్యాలను 300కు పైగా నగరాలలో అందించడం ద్వారా మద్దతునందిస్తుంది. ఈ నగరాలలో అతి ముఖ్యమైన పరీక్షా కేంద్రాలైనటువంటి ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వంటివి సైతం ఉన్నాయి.
 
నీట్‌ ఎడ్వైజర్‌ లాంటి కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఓయోతో భాగస్వామ్యం చేసుకుని విద్యార్థులు ఈ వసతి విషయంలో కాకుండా పూర్తిగా తమ పరీక్షా సంసిద్ధతపైనే దృష్టి సారించేందుకు భరోసా కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఓయో ఎస్సెట్‌ యజమానులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతిని అందించడానికి భరోసా అందించగలరు. తద్వారా వీలైనంత వరకూ హోటల్‌ బయటకు వెళ్లే అవసరాన్నితప్పిస్తారు.
 
విద్యార్థులు లేదంటే వారి తల్లిదండ్రులు అతి సులభంగా ఓయో హోటల్‌ను శానిటైజ్డ్‌ స్టేస్‌ ట్యాగ్‌ ద్వారా తమ పరీక్షా కేంద్రాలకు దగ్గరలోనే కనుగొనగలరు. అంతేకాకుండా తమ కూపన్‌కోడ్‌  ‘OYO4Students’ను ఓయో బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయినటువంటి యాప్‌, వెబ్‌సైట్‌ మరియు ఈమెయిల్‌ హెల్ప్‌లైన్‌పై రిడీమ్‌ చేయవచ్చు.
 
భారతదేశ వ్యాప్తంగా ఔత్సాహిక విద్యార్థులకు మద్దతునందించడంలో ఓయో యొక్క తోడ్పాటును గురించి రోహిత్‌ కపూర్‌, సీఈఓ-ఓయో ఇండియా అండ్‌ దక్షిణాసియా మాట్లాడుతూ, ‘‘ప్రతి సంవత్సరం, పలువురు ఔత్సాహిక యువ విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఇది పెను సవాల్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఈ విద్యార్థులకు, రేపటి కోసం బలీయమైన భారతావని నిర్మాణానికి వీరు కృషి చేస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు సుదూరాలకు ప్రయాణిస్తున్నారు. ఆఖరకు చిన్న పట్టణాలు మరియు నగరాల నుంచి తమ సంబంధిత పరీక్షా కేంద్రాలకు దేశవ్యాప్తంగా చేరుకుంటున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉన్న భయానక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఓయో వద్ద మేము విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఈ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలనుకుంటున్నాము. అందుకోసం నాణ్యమైన, ప్రామాణీకరమైన మరియు సురక్షిత వసతిని అందుబాటు ధరలలో అందిస్తున్నాము. తద్వారా ఔత్సాహిక యువ ప్రతిభావంతులు తమ విద్యాంశాలపై దృష్టి పెట్టడంతో పాటుగా ఈ మహమ్మారి సమయంలో వసతి తదితర అంశాల ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ స్థాయిలో సమాజానికి మద్దతునందించే క్రమంలో మాకు సహకరిస్తున్న ఎస్సెట్‌ భాగస్వాములకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం’’ అని అన్నారు.
 
ఆయనే మరింతగా మాట్లాడుతూ ‘‘మా యాప్‌ లేదా వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ పరీక్షా కేంద్రానికి దగ్గరలోని ఓయో హోటల్‌ను సరసమైన ధరలలో బుక్‌ చేసుకోవచ్చు. ఆ తరువాత మిగిలినదంతా మేము చూసుకుంటాం. ఆఖరకు ఈ తరహా సంక్షోభ సమమంలో కూడా, తమకు అత్యుత్తమ భవిష్యత్‌ మరియు మెరుగైన భారతావని దిశగా వారు మొదటి అడుగును ధైర్యంగా వేయడానికి సిద్ధమైన ఈ 2.4 మిలియన్ల మంది విద్యార్థుల స్ఫూర్తికి మేము వందనాలనర్పిస్తున్నాం’’ అని అన్నారు.
 
తమ అతిథుల ఆరోగ్యం మరియు భద్రతకు భరోసానందిస్తూ ఓయో పలు కార్యక్రమాలను ప్రారంభించింది. శానిటైజ్డ్‌ వసతులు పరిచయం చేయడంతో పాటుగా చెక్‌ ఇన్స్‌, చెక్‌ ఔట్స్‌ వద్ద అతి తక్కువగా స్పృశించే విధానాలు మరియు డిజిటల్‌ చెల్లింపులు వంటివి అందించింది. అంతర్జాతీయ కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీ యునిలీవర్‌తో ఓయో భాగస్వామ్యం చేసుకుంది, తద్వారా ఓయో ప్రోపర్టీల వ్యాప్తంగా తమ శానిటైజేషన్‌ ప్రయత్నాలను మెరుగుపరుస్తుంది.
 
యునీలివర్‌  యొక్క ఆర్‌ అండ్‌ డీ బృందం ఇప్పుడు ఓయోతో భాగస్వామ్యం చేసుకుని క్లీనింగ్‌ కోసం ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను సహ సృష్టించింది తద్వారా తమ ఉత్పత్తులపై సానుకూల ప్రభావాలను గరిష్టం చేసింది. ఎక్కడైతే ఓయో ప్రోపర్టీలలో ఈ ఆపరేటింగ్‌ ప్రక్రియలను వినియోగిస్తున్నారో అక్కడ బుకింగ్‌ పేజీలపై ఓ ట్యాగ్‌ను ప్రదర్శిస్తారు. తద్వారా యునీలీవర్‌ ఉత్పత్తులను క్లీనింగ్‌ సేవల కోసం వినియోగిస్తున్నారని తెలుపుతారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం భారతదేశంలో ఆరంభమైంది . త్వరలోనే ఇండోనేషియా, వియాత్నం, యుఎస్‌, లాటమ్‌ మరియు యూరోప్‌లలో ప్రారంభించనున్నారు.
 
ఇటీవలనే, ఈ తరహా క్లిష్ట సమయాలను అర్థం చేసుకుని, వైరస్‌తో పాటుగా కలిసి జీవించేందుకు నూతన మార్గాలను స్వీకరించడం నేర్చుకుంటున్న వేళ, డిజిటల్‌ మరియు టెక్‌ ఆధారిత పరిష్కారాల ద్వారా ఓయో ఇప్పుడు యో ! హెల్ప్‌ను ఆవిష్కరించింది. అతిథుల కోసం 24 గంటల రియల్‌ టైమ్‌ చాట్‌ అసిస్టెంట్‌ ఇది. అంతర్జాతీయంగా తమ హోటల్స్‌ మరియు గృహాలలో చెల్లుబాటు అయ్యే బుకింగ్‌ సదుపాయం ఇది. ఈ సాంకేతికత ద్వారా, ఈ ఆతిథ్య రంగ చైన్‌ వినియోగదారుల ప్రయాణంలో బుకింగ్‌ తరువాత లేదా చెక్‌ ఔట్‌ తరువాత లేదా క్యాన్సిలేషన్‌ దశ వరకూ క్లిష్టత లేని అనుభవాలను అందించడానికి నిర్థేశించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో భారీ పేలుడు, ఏడుగురు దుర్మరణం