Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద.. రూ.62లక్షల జరిమానా

పిల్లలు లొట్టలేసుకునే తినే మ్యాగీ నూడుల్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడుల్స్‌లో సీసం అధికంగా వుందని ఐదు నెలల పాటు దేశంలో నిషేధానికి గురైన మ్యాగీ నూడుల్స్.. ప్రస్తుతం ల్యాబ్ టెస్టులో ఫెయిలయ్యిం

Advertiesment
మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద.. రూ.62లక్షల జరిమానా
, గురువారం, 30 నవంబరు 2017 (12:57 IST)
పిల్లలు లొట్టలేసుకునే తినే మ్యాగీ నూడుల్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడుల్స్‌లో సీసం అధికంగా వుందని ఐదు నెలల పాటు దేశంలో నిషేధానికి గురైన మ్యాగీ నూడుల్స్.. ప్రస్తుతం ల్యాబ్ టెస్టులో ఫెయిలయ్యింది. మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద నమూనాలు ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో మ్యాగీ నూడుల్స్ సంస్థ నెస్లేకు షాజహాన్‌పూర్ కోర్టు రూ.62 లక్షల జరిమానా విధించింది.  
 
2015లో తీసుకున్న మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్ట్ 2016లో వచ్చింది. దీని ఆధఆరంగా నెస్లే సంస్థపై ఏడు కేసులు నమోదైనాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నెస్లేకు రూ.45 లక్షలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు రూ.15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ.2 లక్షల జరిమానా విధించింది. కానీ కోర్టు ఆర్డర్ కాపీ తమకు అందలేదని.. తాము తయారు చేసే నూడిల్స్ వంద శాతం తినదగినవేనని.. అవి హానికరం కాబోవని నెస్లే ఇండియా నొక్కి చెప్తోంది. మ్యాగీ శాంపిల్స్‌పై ప్రామాణిక రీతిలో  పరీక్షలు నిర్వహించలేదని నెస్లే ఆరోపిస్తోంది.
 
ఇకపోతే.. 2015 జూన్‌లో ఫుడ్ రెగ్యులర్ ఎఫ్ఎస్ఎస్ఎఐ మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం విధించింది. ఇందుకు హానికరమైన కారకాలున్నాయని పేర్కొంది. ఆపై నెస్లీ నూతన తయారీ ప్రమాణాలతో నవంబర్ 2015లో తమ ఉత్పత్తులను తెచ్చింది. అయినప్పటికీ మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన బూడిద ఉన్నట్లు టెస్టులో తేలడంతో కోర్టు నెస్లీ సంస్థకు భారీ జరిమానా విధించింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాతో సమానంగా అణ్వాయుధ సత్తా : ఉత్తర కొరియా