Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ విజువల్స్ రిలీజ్!

Advertiesment
ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ విజువల్స్ రిలీజ్!
, ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:02 IST)
దేశంలో తొలిసారి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2023 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మహారాష్ట్రలోని ముబై మహానగరం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం మధ్య ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
భారత్ - జపాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 508 కిలోమీటర్ల పొడవు ఉన్నా ఈ మార్గంలో ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం హై స్పీడ్ రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టి లిమిటెడ్‌ల మధ్య ఓ కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నిర్మించనుంది. 
 
మొత్తం లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బుల్లెట్ రైల్ విజువల్స్‌ను ఈ సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఇందుకోస ఈ5 సిరీస్‌కు చెందిన బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ బుల్లెట్ రైల్ విజువల్స్‌ను తాజా రిలీజ్ చేయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి లేనట్టే : వైద్య నిపుణులు