Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్లోకి డైనమిక్ డిజైన్, ఆకర్షణీయమైన మెర్సెడెజ్ బెంజ్ జిఎల్ఎ కారు

ప్రముఖ మెర్సిడెస్ బెంజ్ తన SUV పోర్ట్ ఫోలియోను మరింత దృఢపరుస్తూ కొత్త జిఎల్ఎను ప్రారంభించింది. స్టైలిష్ SUV డైనమిక్ డిజైన్, శక్తివంతమైన ఆకర్షణీయంగా మూడు ఇంజిన్లయిన GLA 200, GLA 200 d మరియు GLA 220 d 4

Advertiesment
మార్కెట్లోకి డైనమిక్ డిజైన్, ఆకర్షణీయమైన మెర్సెడెజ్ బెంజ్ జిఎల్ఎ కారు
, బుధవారం, 5 జులై 2017 (20:10 IST)
ప్రముఖ మెర్సిడెస్ బెంజ్ తన SUV పోర్ట్ ఫోలియోను మరింత దృఢపరుస్తూ కొత్త జిఎల్ఎను ప్రారంభించింది. స్టైలిష్ SUV డైనమిక్ డిజైన్, శక్తివంతమైన ఆకర్షణీయంగా మూడు ఇంజిన్లయిన GLA 200, GLA 200 d మరియు GLA 220 d 4 MATIC లతో ముందుకు వచ్చింది.
 
* డైనమిక్ ఎక్స్‌టీరియర్ హైలెట్స్ -  జిఎల్ఎ నూతన ఫీచర్స్ చూస్తే ఇట్టే ఆకట్టుకుంటాయి. డిజైన్ చూడముచ్చటగా వుంటుంది. 
 
* ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్: GLA 220 d 4MATIC ఫీచర్స్ చూస్తే 2,143 ఇన్లైన్ 4 ఇంజిన్‌తోనూ 125 kw అవుట్‌పుట్‌తో 350 Nm టార్క్‌తో కేవలం 7.7 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకోగలదు.
 
* 7జి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషనుతో మోటరైజ్ చేయబడింది. అంతేకాదు రాపిడ్ గేర్ షిప్ట్స్‌కు GLA నిర్థారిస్తుంది. డ్రైవింగ్ ప్రదర్శనలో ఫ్యూయల్ ఎఫిషియన్సీలోనూ ఎలాంటి రాజీలేకుండా తయారుచేయడం జరిగింది.
 
* 45.7 సెం.మీ(18 అంగుళాలు) 5 ట్విన్ స్పోక్ లైట్ ఎల్లాయ్ వీల్స్, బంపర్లో ట్విన్ పైప్ ఎగ్జాస్ట్ సిస్టమ్, క్రోమ్ ప్లేటెడ్‌తో చేయబడి వుంది.
 
* ప్రకాశవంతమైన లెడ్ హై పెర్ఫార్మెన్స్ హెడ్ లైట్లు ఫైబర్ ఆప్టిక్స్‌తో చేయబడ్డాయి. 
 
* 12 రంగుల్లో లైటింగ్, 5 డిమ్మింగ్ లెవల్స్, పూర్తి లెడ్ టెక్నాలజీతో వెలుగులు.
* కలర్ పోర్ట్ ఫోలియో: మౌంటెయిన్ గ్రే, సిర్రస్ వైట్, పోలార్ సిల్వర్ మెటాలిక్.
 
* మెర్సెడెస్ బెంజ్ జిఎల్ఎ ధరలు చూస్తే...  
GLA 200 d స్టైల్: రూ 30.65 లక్షలు, GLA 200 స్పోర్ట్: రూ. 32.20 లక్షలు.
GLA 200 d స్పోర్ట్: రూ. 33.85 లక్షలు, GLA 220 d 4 MATIC : రూ 36.75 లక్షలు.
 
ఈ కొత్త కార్లను ప్రవేశపెట్టిన సందర్భంగా మైకేల్ జోప్ మాట్లాడుతూ.... ఇప్పటికే ఈ కార్లు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. కొత్తదనాన్ని కోరుకునేవారికి ఈ కార్లు ఆకట్టుకుంటాయి. సేఫ్టీ ఫీచర్స్, స్పోర్టీ డిజైన్స్, కావలసిన అన్ని హంగులు ఈ కార్లలో వున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూరగాయల ధరల పెరుగుదలకు... జీఎస్టీకి సంబంధం లేదు... యనమల