Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లియాండర్‌ పేస్‌తో లీడర్‌షిప్‌, సహకారంపై ప్రత్యేకంగా మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌

Advertiesment
Leander Pace
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:37 IST)
భారతదేశంలోని చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటుగా అవకాశాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా భారతదేశపు అగ్రగామి పాఠశాల ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ నేడు ఎక్స్‌క్లూజివ్‌ మాస్టర్‌ క్లాస్‌‌ను నాయకత్వం మరియు సహకారంపై ఒలింపిక్‌ పతక విజేత, లెజండరీ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌తో నిర్వహించినట్లు వెల్లడించింది. భారతదేశంలో 400కు పైగా పట్టణాలు, నగరాల్లోని లీడ్‌ పవర్డ్‌ స్కూల్స్‌ విద్యార్థుల కోసం ట్యూటర్‌, మార్గదర్శిగా లియాండర్‌ మారారు. ఆయన తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాలను గురించి వెల్లడించడంతో పాటుగా  విజయవంతమైన నాయకత్వం, సహకారం పరంగా రహస్యాలను వెల్లడించారు. ఈ రెండు లక్షణాలే టెన్నిస్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్‌ ఆటగాళ్లలో ఒకరిగా తనను నిలిపాయని వెల్లడించారు.

 
లీడ్‌ విద్యార్ధులతో తన అనుబంధం గురించి లియాండర్‌ పేస్‌ మాట్లాడుతూ, ‘‘లీడ్స్‌ మాస్టర్‌ క్లాస్‌లో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. తాదాత్మ్యం, తేజస్సు, కమ్యూనికేషన్‌, సమస్యా పూరణం యొక్క సరైన కలయిక నాయకత్వం. నేటి ప్రపంచంలో, విద్యార్థులు తప్పనిసరిగా 21వ శతాబ్దపు నైపుణ్యాల పట్ల మార్గనిర్ధేశనం చేయాల్సి ఉంది. ఆత్మవిశ్వాసం పెంపొందించే నైపుణ్యాలైనటువంటి లీడర్‌షిప్‌, సహకారం, కమ్యూనికేషన్‌ వంటి వాటి గురించి చిన్నతనం నుంచే వెల్లడించాల్సి ఉంది. తద్వారా జీవితంలో ప్రతి అంశంలోనూ విజయవంతం కావడానికి అత్యంత బలమైన పునాదిని ఇది అందించనుంది’’ అని అన్నారు.

 
లీడ్‌ కో-ఫౌండర్‌ సీఈఓ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ, ‘‘విద్యార్థులలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంలో అత్యంత కీలకంగా ఎక్స్‌పోజర్‌ నిలుస్తుందని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌తో లీడ్‌ భాగస్వామ్యం ద్వారా చేసిన అధ్యయనం వెల్లడించింది. లీడ్‌ నిర్వహించిన మాస్టర్‌ క్లాస్‌తో భారతదేశపు టియర్‌ 2+ పట్టణాలలోని విద్యార్థులు సైతం మెట్రో నగరాల్లోని విద్యార్థులలా ఎక్స్‌పోజర్‌, అవకాశాలు ఇప్పుడు పొందగలుగుతున్నారు. భవిష్యత్‌కు అవసరమైన జీవిత నైపుణ్యాలను ఆ అంశాలపై నిపుణులు, లియాండర్‌ పేస్‌ లాంటి సెలబ్రిటీల నుంచి అభ్యసించగలరు. తామున్న ప్రాంతం లేదా తమ స్ధితిగతులతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికీ అత్యద్భుతమైన అభ్యాసాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లీడ్‌ మా లక్ష్యాలలో అతి కీలకమైన భాగం మాస్టర్‌ క్లాస్‌’’ అని అన్నారు.

 
లీడ్‌ పవర్డ్‌ స్కూల్స్‌కు చెందిన విద్యార్ధులు పూర్తి శ్రద్ధతో ఈ మాస్టర్‌క్లాస్‌ను విన్నారు. జీవితంలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన అంశాలను గురించి లియాండర్‌ వెల్లడించారు. దీనిలో సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు ఉన్న మార్గాలు, టీమ్‌ డైనమిక్స్‌ను అత్యుత్తమంగా అర్ధం చేసుకోవడం మరియు రోజువారీ పరిస్థితులలో భావోద్వేగ ఇంటిలిజెన్స్‌ పై ఆధారపడటం వంటి అంశాలు సైతం ఉన్నాయి.

 
భారతదేశంలోని చిన్న పట్టణాలలోని పాఠశాల విద్యార్థులకు సైతం సంపూర్ణమైన అభ్యాస అనుభవాలను అందించేందుకు ప్రారంభించిన  భారతదేశపు మొట్టమొదటి కార్యక్రమం లీడ్స్‌ మాస్టర్‌ క్లాస్‌. దీనిద్వారా ఆయా బోధనాంశాలలో నిపుణులు, సెలబ్రిటీల నుంచి నేరుగా అభ్యసించే అవకాశం కలుగుతుంది.  వ్యక్తిగత ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా లీడ్స్‌ మాస్టర్‌ క్లాస్‌ సిరీస్‌ విద్యార్థులను పెద్ద కలలు కనాల్సిందిగా ప్రోత్సహిస్తూనే, తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో తగిన ఆత్మవిశ్వాసమూ అందిస్తుంది. గతంలో లీడ్‌ మాస్టర్‌ క్లాస్‌ పాఠాలకు సెలబ్రిటీలైనటువంటి బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, టెన్నిస్‌ చాంఫియన్‌ సానియా మీర్జా, లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ వంటి వారు హాజరయ్యారు. లీడ్‌ యొక్క తాజా మాస్టర్‌ క్లాస్‌ గత ఎడిషన్‌లో నటుడు-దర్శకుడు ఆర్‌ మాధవన్‌ మాస్టర్‌ క్లాస్‌ను అనుసరించింది. ఈ మాస్టర్‌ క్లాస్‌ వ్యక్తిత్వ వికాసం, వృద్ధి మనస్తత్వాన్ని నిర్మించడం, అపూర్వ విజయం సాధిచడం అనే అంశాలపై జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూచ్.. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు : కల్వకుంట్ల కవిత