Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSIతో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధం

image

ఐవీఆర్

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (19:37 IST)
బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ప్రతిభను పెంపొందించడానికి కోటక్ నెక్ట్స్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిం చేందుకు మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSI తో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధం ఏర్పరచుకుంది. 12-నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ అనేది ఆసక్తి గలవారికి కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌లో శిక్షణ అందిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌లో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్)గా హామీ ఇవ్వబడిన ఉద్యోగాన్ని అందిస్తుంది.
 
మారుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ల్యాండ్‌స్కేప్ అనేది అభివృద్ధి చెందుతున్న కస్టమర్ అవసరాలు, ప్రాధాన్యతలను కొనసాగించడానికి ప్రతిభకు ఎక్కువ డిమాండ్‌ను సృష్టించింది. కోటక్ నెక్ట్స్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ బ్యాంకింగ్ పరిశ్రమ అవసరాలను పరిష్కరిస్తుంది. సంతోషకరమైన కస్టమర్-కేంద్రిత సేవలను అందించడంలో బ్యాంక్‌కు మద్దతు ఇస్తుంది. బ్యాంకుకు చెందిన బ్యాంకింగ్ నిపుణులు, ఉన్నతోద్యోగులు అందించే సమగ్ర తరగతి గది, ఉద్యోగ శిక్షణ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంస్కృతిని, పరిశ్రమ-గుర్తింపు పొందిన ప్రక్రియలలో ప్రతిభను అందిస్తుంది.
 
కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, గ్రూప్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ బ్యాంక్ హెడ్ విరాట్ దివాన్‌జీ మాట్లాడుతూ, ‘‘ప్రతిభను పెంపొందించడానికి, బ్యాంకింగ్ పరిశ్రమ కోసం కొత్తతరం రిలేషన్షిప్ మేనేజర్‌లను సిద్ధం చేయడానికి మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSIతో అనుబంధం మాకు సంతోషంగా ఉంది. కోటక్ మహీంద్రా నెక్స్ట్‌ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకమైన, ఔత్సాహిక యువతకు ఆదర్శవంతమైన లాంచ్ ప్యాడ్. ఇది వారి బ్యాంకింగ్ కెరీర్‌లో వృద్ధి, విజయానికి అవసరమైన నైపుణ్యాలను సమకూరుస్తుంది’’ అని అన్నారు.
 
మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSI చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబిన్ భౌమిక్ మాట్లాడుతూ, ‘‘నెక్ట్స్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాం. ఆర్థిక సేవలలో ఉద్యోగాల కోసం BFSI యొక్క సుసంపన్న పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి మేం ఎదురుచూస్తున్నాం. ఈ కార్యక్రమం టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణను, బలమైన కస్టమర్-కేంద్రిత విధానంతో కవర్ చేస్తుంది. బ్యాంక్ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించే తదుపరి తరం బ్యాంకర్లను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావణాసురుడిని అంతం చేసేందుకే వానర సైన్యం ఏకమైంది : చంద్రబాబు