Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త డేటా అనలిటిక్స్ శిక్షణా కార్యక్రమంతో నూతన ప్రమాణాలను నెలకొల్పిన కెఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్ క్యాంపస్

Advertiesment
KLH Aziznagar Campus

ఐవీఆర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (20:01 IST)
కెఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్ క్యాంపస్ నేడు కెసి పుల్లయ్య ఫౌండేషన్, టెక్ మహీంద్రా ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందం(MOU)పై సంతకం చేసినట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మూడు నెలల ఇంటెన్సివ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమం, తదుపరి ప్లేస్‌మెంట్ సహాయం ద్వారా కెఎల్‌హెచ్‌ విద్యార్థులను అవసరమైన పరిశ్రమ నైపుణ్యాలతో సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. వృత్తిపరమైన పోటీ అధికంగా కలిగిన వాతావరణంలో అవకాశాలను అందిపుచ్చుకొవటానికి, రాణించడానికి అవసరమైన సామర్థ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది.
 
కెఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ అకెల్ల, కె సి పుల్లయ్య ఫౌండేషన్ సీఈఓ శ్రీమతి సుధా చల్లా, హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా ఫౌండేషన్ విద్య- ఉపాధి కల్పన మేనేజర్ శ్రీమతి సుమన కొత్తపల్లితో కలిసి సంతకాల కార్యక్రమానికి నాయకత్వం వహించారు. "ఈ భాగస్వామ్యం మా విద్యార్థులకు అందించే అవకాశాల పట్ల మేము ఆసక్తిగా ఉన్నాము, డేటా అనలిటిక్స్ రంగానికి గణనీయమైన సహకారాలకు వారిని సిద్ధం చేస్తున్నాము" అని డాక్టర్ రామకృష్ణ అకెల్ల అన్నారు. ఈ కార్యక్రమం, విద్యార్థులు విశ్లేషణాత్మక, సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, వారి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, డేటా అనలిటిక్స్  రంగంలో హామీ ఇచ్చే కెరీర్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది" అని అన్నారు. 
 
కెఎల్‌ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ మాట్లాడుతూ "డేటా అనలిటిక్స్‌లో నాయకత్వం వహించే, ఆవిష్కరణలు చేసే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తీర్చిదిద్దే మా లక్ష్యంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. నాణ్యమైన విద్య, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా మా విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. డాక్టర్ సుధా రాణి చల్లా మాట్లాడుతూ, "ఈ భాగస్వామ్యం, అత్యాధునిక సాంకేతిక రంగాలలో నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా, నేటి పోటీ ఉద్యోగ మార్కెట్‌లో రాణించడానికి విద్యార్థులను శక్తివంతం చేయడమే మా లక్ష్యం." అని అన్నారు. 
 
టెక్ మహీంద్రా ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి సుమన కె మాట్లాడుతూ, "నేటి ఉపాధి సవాళ్లను పరిష్కరించడానికి స్మార్ట్ ప్రోగ్రామ్ రూపొందించబడింది. ఈ భాగస్వామ్యం ద్వారా, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ వృద్ధికి బలమైన వేదికను సృష్టించాలని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు. 2025 ప్రారంభంలో ప్రారంభం కానున్న కెఎల్‌హెచ్‌ లోని డేటా అనలిటిక్స్ శిక్షణా కార్యక్రమంలో, విద్యార్థులను వాస్తవ ప్రపంచ సవాళ్లకు సిద్ధం చేయడానికి, నిరంతరం అభివృద్ధి చెందుతున్న డేటా అనలిటిక్స్ రంగంలో కెరీర్‌లకు వారు బాగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి రూపొందించబడిన కఠినమైన పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం టెక్ మహీంద్రా ఫౌండేషన్ యొక్క స్మార్ట్ ప్రోగ్రామ్ యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది, ఇది కెఎల్‌హెచ్‌ యొక్క విద్యా నైపుణ్యంతో కలిపి, బహుళ లక్ష్యాలను సాధించడానికి రవించబడిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం.
 
ఈ భాగస్వామ్యం, ప్రతిభను పెంపొందించడానికి, ఉపాధిని పెంచడానికి, సమాజం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సానుకూలంగా దోహదపడటానికి కెఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్ క్యాంపస్ యొక్క భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!