Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RBI బ్యాంక్ ఉద్యోగాలు గంటకు రూ.1000

Advertiesment
RBI బ్యాంక్ ఉద్యోగాలు గంటకు రూ.1000
, శనివారం, 9 డిశెంబరు 2023 (10:09 IST)
RBI బ్యాంక్ ఉద్యోగాలు గంటకు రూ.1000 పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు 22/12/2023 లోపు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
 
RBI ఖాళీలు:
మెడికల్ కన్సల్టెంట్ (MC) పోస్టుకు 18 ఖాళీలు ఉన్నాయి.
 
అభ్యర్థి తప్పనిసరిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అభ్యర్థి తప్పనిసరిగా కనీసం 2 (రెండు) సంవత్సరాల క్వాలిఫైయింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఒక వైద్యుడు ఆసుపత్రి లేదా క్లినిక్‌లో అల్లోపతి వైద్యాన్ని అభ్యసించి ఉండాలి.
 
మెడికల్ కన్సల్టెంట్ జీతం:
కాంట్రాక్ట్ వ్యవధిలో, వేతనం గంటకు రూ.1000 ఉంటుంది. 
 
RBI బ్యాంక్ పరీక్షా విధానం:
అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే వివాహం.. 3 లక్షల మందికి ఆహ్వానం