Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోగనిరోధక శక్తి ప్రయోజనాలతో ప్రోబయాటిక్‌ పెరుగును ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

Advertiesment
రోగనిరోధక శక్తి ప్రయోజనాలతో ప్రోబయాటిక్‌ పెరుగును ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌
, గురువారం, 10 డిశెంబరు 2020 (18:15 IST)
హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు ప్రోబయాటిక్‌ పెరుగును ఆవిష్కరించింది. బిఫిడో బ్యాక్టీరియం స్ట్రెయిన్‌ కలిగి ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటుగా మొత్తంమ్మీద ఆంత్రము యొక్క ఆరోగ్యమూ మెరుగుపరుస్తుంది.
 
హెరిటేజ్‌ ప్రోబయాటిక్‌ కర్డ్‌లో చక్కటి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది పలు పౌష్టికాహార ప్రయోజనాలతో పాటుగా ఆంత్రము ఆరోగ్యమూ మెరుగుపరుస్తుంది. ఆరోగ్యవంతమైన ఆంత్రము ఉంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. హెరిటేజ్‌ ప్రో బయాటిక్‌కర్డ్‌లో ప్రో బయాటిక్‌ బ్యాక్టీరియా అయిన బిఫిడో బ్యాక్టీరియం మరియు లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్‌ ఉంటాయి.
 
ప్రతి 100 గ్రాముల హెరిటేజ్‌ ప్రో బయాటిక్‌ కర్డ్‌లో 100 మిలియన్‌ చక్కటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఓ వ్యక్తికి 20% కాల్షియం మరియు 5% ప్రొటీన్‌ను అందిస్తుంది. దీనిలో ఎలాంటి నిల్వ పదార్థాలూ జోడించలేదు. ఆధునిక రిటైల్‌ స్టోర్లు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌, ఎంపిక చేసిన స్టాండలోన్‌స్టోర్లు, హెరిటేజ్‌ పార్లర్లు, హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ల వద్ద 200 గ్రాములు మరియు 400 గ్రాముల ప్యాక్‌లలో లభిస్తాయి. వీటి ధరలు వరుసగా 35 మరియు 70 రూపాయలు. తొలుత హెరిటేజ్‌ ప్రోబయాటిక్‌ కర్డ్‌ హైదరాబాద్‌లో లభ్యమవుతుంది. అనంతర కాలంలో దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో లభ్యం కానుంది.
 
శ్రీమతి నారా బ్రాహ్మణి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘పెరుగులో మార్కెట్‌ లీడర్‌గా వెలుగొందుతున్న సంస్థ నుంచి ప్రోబయాటిక్‌ కర్డ్‌ రావడమన్నది వినియోగదారులకు సంతోషదాయకమైన అంశం. ఇది మా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ఉత్పత్తి శ్రేణిని బలోపేతం చేయడంలో తోడ్పడటంతో పాటుగా మా వినియోగదారులకు పాలు లేదా పెరుగు పరంగా విస్తృతశ్రేణి అవకాశాలనూ అందిస్తుంది.
 
కేవలం పేగుల ఆరోగ్య పరంగా మాత్రమే కాదు రోగ నిరోధక వ్యవస్ధకు మద్దతునందించేందుకూ ప్రోబయాటిక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతశ్రేణిలో వినియోగిస్తున్నారు. అందువల్ల హెరిటేజ్‌ ప్రోబయాటిక్‌ కర్డ్‌ను రోజూ తీసుకుంటే అది వ్యాధుల ప్రమాదం తగ్గించడమే కాదు, రోగ నిరోధక శక్తినీ పెంపొందిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్భుతమైన ప్రాజెక్టు.. ఆహ్వానించడం ఎంతో సంతోషం : రతన్ టాటా