Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నానాటికీ పెరిగిపోతున్న పసిడి ధరలు.. అడిగినప్పుడు కొనలేకపోయినం.. ఇప్పుడేమో కొనలేకున్నాం

gold

ఠాగూర్

, ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (10:07 IST)
దేశంలో పసిడి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రేపటి అవసరాలకు.. ఇప్పటి అలంకారానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో పైసాపైసా కూడబెట్టి మరీ పసిడి కొనుగోలు చేస్తుంటారు. పండగలు.. వివాహ శుభకార్యాల సమయంలో దీనికి భలే గిరాకీ ఉంటుంది. కుటుంబ సభ్యులు కొనాలని అనుకున్నపుడు కాస్త తగ్గాక చూద్దామని వాయిదా వేశాం. ఇప్పుడేమో ఆకాశాన్నంటిన ధరలు చూసి కొనే సాహసం చేయలేకపోతున్నామంటున్నారు మహిళలు. కొద్దిరోజులు పెరుగుతూ వచ్చిన స్వర్ణం.. తాజాగా రికార్డు స్థాయికి చేరింది. 
 
తులం ధర రూ.73150.. పసిడి ధర పరుగులు పెడుతోంది. రోజుకో జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుతోంది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా మూడువేలకుపైగా ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారట్‌ల పుత్తడి ధర నగరంలో రూ.73150 పలికింది. ఈ పరుగు ఇంకెక్కడి దాకా వెళుతుందోనని  ఆందోళన చెందుతున్నారు. ఆభరణాలను ఎక్కువగా 22 క్యారట్‌ బంగారంతో చేస్తుంటారు. ధరలు అందనంత ఎత్తుకు చేరడంలో ఆభరణాల తయారీదారులు వ్యూహం మార్చారు. 18, 16 క్యారట్లతో అధునాతన డిజైన్లను రూపొందిస్తున్నారు. వీటిని సైతం భరించలేనివారు ఒక గ్రాము బంగారం కొనుగోలు చేస్తున్నారు. అధికాదాయ వర్గాలు వజ్రాభరణాలకే మొగ్గుచూపుతున్నారు. ‘సంక్రాంతి సమయంలో 10 తులాలు బంగారు ఆభరణాలు కొనేందుకు సిద్ధమయ్యాం.. ధర తగ్గుందని ఆగాం.. ఇప్పుడేమో అసలు కొనగలమా అనిపిస్తోంది. వాయిదా వేసి తప్పుచేశామని బాధేస్తుందని’  గృహిణి నీరజ తెలిపారు.
 
కరోనా విపత్తుకు ముందు వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేల వరకు ఉండేది. ఆ తర్వాత మూడేళ్లలోనే అది రూ.70 వేలకు ఎగబాకింది. ఈ స్థాయిలో ధరలు పెరుగుతూ ఉంటే నచ్చిన మోడల్స్‌ కొన లేమోమో అన్పిస్తుంది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వారికి నచ్చిన డిజైన్స్‌ కొనాలనుకుంటారు. ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గ లేదు. మూడేళ్ల కాలంలో పెరిగిన ధరలతో బంగారు ఆభరణాలు కొనలేనివారు వెండి ఆభరణాల వైపు కొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడగానే షాక్ కొట్టింది.. రైతు కూలీకి రూ.1,22,206 విద్యుత్తు బిల్లు