Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరించిన ఫెనెస్టా

image
, శనివారం, 9 డిశెంబరు 2023 (21:10 IST)
భారతదేశంలో అతిపెద్ద విండోస్ అండ్ డోర్స్ బ్రాండ్‌గా గుర్తింపు పొందటంతో పాటుగా తమ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న, ఫెనెస్టా, మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించడంతో తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ దివ్య హోమ్ సొల్యూషన్స్ 18-2-179, దివాకర్ బస్ స్టాండ్ ఎదురుగా, గూటి రోడ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్- 515001 వద్ద ఉంది, అత్యుత్తమ అల్యూమినియం కిటికీలు, తలుపులు, uPVC విండోస్& డోర్ మరియు సాలిడ్ ప్యానెల్ డోర్స్‌‌ని అందిస్తుంది.
 
ఈ సందర్భంగా ఫెనెస్టా బిజినెస్ హెడ్ శ్రీ సాకేత్ జైన్ మాట్లాడుతూ, "విభిన్న ఉత్పత్తుల శ్రేణితో, మా కస్టమర్‌ల పట్ల మేము చూపుతున్న అంకితభావం మా స్థిరమైన వృద్ధికి ఆజ్యం తోడ్పడింది. ప్రతి నూతన షోరూమ్‌ ప్రారంభం, మా కస్టమర్లు మా పట్ల చూపుతున్న నమ్మకానికి నిదర్శనం. ఇది  అసమానమైన సేవలను అందించడానికి మేము చేసిన ప్రతిజ్ఞను సైతం పునరుద్ఘాటిస్తుంది. ఈ షోరూమ్‌లు కేవలం ప్రాంగణాలు మాత్రమే కాదు; కస్టమర్‌లు మా ఉత్పత్తులలో తమను తాము లీనం చేసుకోగలిగే, మా బ్రాండ్ తత్వశాస్త్రాన్ని గ్రహించి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే డైనమిక్ పాయింట్‌లు. మా సరికొత్త షో రూమ్ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా సమగ్రంగా విస్తరించేందుకు కొనసాగుతున్న మా మిషన్‌లో షోరూమ్ కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది" అని అన్నారు. 
 
ఈ ఆవిష్కరణతో, మా ఇప్పటికే ఉన్న, సంభావ్య కస్టమర్‌లకు ఇంటరాక్టివ్ మరియు ఇన్ఫర్మేటివ్ కొనుగోలు అనుభవాన్ని అందించడానికి ఫెనెస్టా మరో మైలురాయిని సూచిస్తుంది. ఫెనెస్టా షోరూమ్‌లు గణనీయమైన రీతిలో కస్టమర్‌లను చేరుకోవడానికి, మార్కెట్ లీడర్‌గా నిలబెట్టడానికి విజయవంతంగా సహకరిస్తున్నాయి. భారతదేశంలో అల్యూమినియం విండోస్ మరియు డోర్స్, uPVC విండోస్ & డోర్ మరియు సాలిడ్ ప్యానెల్ డోర్స్ కేటగిరీలలో వేగవంతమైన వృద్ధితో, బ్రాండ్ తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి మరియు భవిష్యత్తులో తన నాయకత్వ స్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది.
 
ఆయనే మరింత గా మాట్లాడుతూ "మా భాగస్వాములు, వాటాదారుల అందిస్తున్న తిరుగులేని మద్దతు చూపుతున్న మహోన్నత నమ్మకంతో, మేము ఈ గొప్ప స్థాయికి చేరుకున్నాము. మా ప్రయాణం ఇప్పటివరకు అసాధారణమైన దానికి తక్కువ ఏమీ కాదు, ఇప్పుడు మేము రాబోయే సంవత్సరాల్లో వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉన్నాము. పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహం, విభిన్న ఉత్పత్తుల శ్రేణి, టైర్ 2 మరియు టైర్ 3 మార్కెట్‌లపై దృఢంగా దృష్టి పెట్టడం ద్వారా ఈ స్థాయి విజయం సాధించబడింది. మా విధానంలోని ప్రతి అంశం అనుబంధం మరింత గా  పెంపొందించడానికి, జ్ఞానాన్ని అందించడానికి మరియు మా విలువైన కస్టమర్‌ల కోసం శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించడానికి ఖచ్చితంగా రూపొందించబడింది..." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది.. వైద్యులు