Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్ పోలిశెట్టి బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదలో 80 శాతం వాటా కొనుగోలు చేసిన ఐఎస్‌పిఏ

Advertiesment
image

ఐవీఆర్

, శనివారం, 1 జూన్ 2024 (22:41 IST)
భారతదేశపు సాంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయికి ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో, పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద (PSA) వ్యవస్థాపకుడు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి, యుకె లోని బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద (BCA)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. డాక్టర్ పోలిశెట్టి యొక్క సాయి గంగా పనాకియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విభాగం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద (IPSA). యుకె పురాతన ఆయుర్వేద కళాశాల, BCA లో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో వినూత్న కోర్సులను పరిచయం చేయనుంది.
 
"తాజా సాంకేతికతలు, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే ఆయుర్వేదం, జీవనశైలి వేరియబుల్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఒకటిగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కొత్త భాగస్వామ్యం యుకె, భారతదేశానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకం చేసి పీఎస్ఏలో పురోగతులను బలోపేతం చేస్తుంది. దాని ప్రయోజనాలు విస్తృత శ్రేణిలో వ్యక్తులకు చేరుకోవడంలో సహాయపడతాయి” అని డాక్టర్ పోలిసెట్టి చెప్పారు.
 
ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందని డాక్టర్ పోలిశెట్టి అన్నారు, ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది తోడ్పడుతుంది. “BCAతో మా కూటమి IPSA యొక్క విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక మరియు ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్తృత నైపుణ్యాలను అందిస్తుంది. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యుల జాబితాను  కూడా PSA సృష్టిస్తుంది” అని డాక్టర్ పోలిసెట్టి వెల్లడించారు.
 
యుకె పార్లమెంట్‌లోని ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ ట్రెడిషనల్ సైన్సెస్ సెక్రటేరియట్ అమర్‌జిత్ భమ్రా సమక్షంలో డాక్టర్ పోలిశెట్టి, BCA ప్రతినిధులు డాక్టర్ మౌరూఫ్ అథిక్, డాక్టర్ శాంత గొడగామా మధ్య ఎమ్ఒయుపై సంతకం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్‌కే గెలుపు.. ఏపీలో ఆ ముగ్గురు?