Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకుల వద్ద భారీ క్యూ... ఫుల్ సెక్యూరిటీ... కొత్త నోట్ల పంపిణీ షురూ...

దేశ వ్యాప్తంగా కొత్త కరెన్సీ నోట్ల పంపిణీ గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తమ వద్ద ఉన్న పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద భారీ బం

Advertiesment
Currency Notes starts
, గురువారం, 10 నవంబరు 2016 (11:24 IST)
దేశ వ్యాప్తంగా కొత్త కరెన్సీ నోట్ల పంపిణీ గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తమ వద్ద ఉన్న పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ,1000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అలాగే, కొత్త నోట్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమైంది. దీంతో ప్రజలు బ్యాంకులు తెరవడానికి మరో గంటన్నర ముందే పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. బ్యాంకులు తెరిచే సమయానికి క్యూలు కొండవీటి చాంతాడులా మారిపోయింది. 
 
దీంతో ఎటువంటి తోపులాటలు జరగకుండా బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే బ్యాంకులకు కొత్తనోట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో నగదు మార్పిడిని ఉదయం నుంచీ చేయలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాతే నోట్ల మార్పిడి చేస్తామని చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నోట్ల మార్పిడి సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు.. జేబు దొంగలకు కష్టాలు.. వందనోట్లు పెట్టుకోవడం తెలీదా? అంటూ పర్సు విసిరేశారు..