Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొక్కజొన్న, సోయాబీన్ పంటల కోసం అధునాతన క్రిమిసంహారకమైన ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా విడుదల

crop

ఐవీఆర్

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:47 IST)
ప్రముఖ వ్యవసాయ రసాయన సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, మొక్కజొన్న, సోయాబీన్ పంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తాజా పురుగుమందు ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రాను విడుదల చేసింది. ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా అన్ని రకాల గొంగళి పురుగుల నుండి ముఖ్యంగా ఫాల్ ఆర్మీ వార్మ్(కత్తెర పురుగు), స్పోడోప్టెరా (పొగాకు లద్దె పురుగు) నుండి సమర్థవంతమైన రక్షణను అందించడానికి రూపొందించబడింది. ఇది దీర్ఘకాలిక పంట భద్రతను నిర్ధారిస్తుంది, పంట కాలంలో గరిష్ట దిగుబడిని పొందడానికి రైతులకు సహాయపడుతుంది. ఈ వినూత్న పరిష్కారం పంట ఆరోగ్యం, ఉత్పాదకను పెంచడానికి రైతులకు దోహదపడుతుంది.
 
ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా అనేది కాంటాక్ట్, సిస్టమిక్, ట్రాన్స్‌లామినార్ పురుగుమందు, ఇది గొంగళి పురుగులను పక్షవాతానికి గురి చేసి పంటకు నష్టం జరగకుండ దోహదపడుతుంది. ఇది ఒక ఈసీ సూత్రీకరణ, ఇది విస్తృత శ్రేణి గొంగళి పురుగుల కీటకాలపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది. దీని వినియోగం తర్వాత పంటల నష్టాన్ని వేగంగా గొంగళి పురుగు నిలిపివేస్తుంది. దీర్ఘకాలం పాటు వేగవంతమైన నియంత్రణను అందిస్తుంది. ఇది కీటకాల రూపాంతరాన్ని నిరోధిస్తుంది, ఇది కీటకాలను మరొక నష్టపరిచే దశలోకి మార్చకుండా నిరోధిస్తుంది. రైతులు సోయాబీన్ విత్తిన 30-60 రోజుల, 60-90 రోజుల దశలో ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రాను వినియోగించాలి. మొక్కజొన్న విత్తిన 11-25 రోజులకు, 26-60 రోజులకు పిచికారీ చేయాలి. రెండు స్ప్రేల మధ్య 15 రోజుల విరామం ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రభావాన్ని మరింత మెరుగుపరచడానికి, రైతులకు సరైన, సురక్షితమైన వినియోగం గురించి మార్గనిర్దేశం చేసేందుకు మేము నిరంతరం శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాము.
 
ఈ ఆవిష్కరణపై క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ, "రైతు సమాజంతో సన్నిహితంగా పని చేయడం, వ్యవసాయ లాభదాయకత, పంట రక్షణలో స్థిరత్వాన్ని మెరుగుపరచడం అనేది క్రిస్టల్ యొక్క లక్ష్యం, మేము ప్రోక్లెయిమ్ ఎక్స్‌ట్రాను తీర్చిదిద్దిన ప్రధాన కారణం అది. ఈ ప్రత్యేకమైన సూత్రీకరణ విస్తృత శ్రేణి గొంగళి పురుగులని నియంత్రించడమే కాకుండా, సోయాబీన్, మొక్కజొన్న రైతులకు మెరుగైన దిగుబడిని అందించడానికి దోహదపడుతుంది. ప్రోక్లెయిమ్ ఎక్స్‌ట్రా అనేది అందరికీ లాభదాయకమైన వ్యవసాయ క్షేత్రాలను నిర్మించాలనే మా ప్రయత్నాలకు ఒక విస్తరణ. క్రిస్టల్ యొక్క వినూత్న ఆర్&డి సామర్ధ్యం యొక్క వారసత్వం, భారతీయ రైతులకు స్థిరమైన వ్యవసాయ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉంది, ఎక్స్‌ట్రా మా ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది" అని అన్నారు. 
 
"వ్యవసాయ లాభదాయకత, సుస్థిరతను పెంచడానికి రూపొందించబడిన పంటల రక్షణలో గేమ్-ఛేంజర్ అయిన ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రాని పరిచయం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన సూత్రీకరణ గొంగళి పురుగులను సమర్థవంతంగా నిర్మూలించటం లక్ష్యంగా చేసుకుంటుంది, సోయాబీన్, మొక్కజొన్న రైతులకు అధిక దిగుబడిని అందిస్తుంది. ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, భారతీయ రైతులకు సాధికారత కల్పించే వినూత్న పరిష్కారాలను అందిస్తుంది" అని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ హెడ్ శ్రీ సోహిత్ సత్యవాలి జోడించారు.
 
ఉత్పత్తి యొక్క ప్రభావాన్ని వివరించిన పోర్ట్‌ఫోలియో హెడ్ ఇన్‌సెక్టిసైడ్ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, శ్రీ ప్రవీణ్ గౌర్ మాట్లాడుతూ, “వ్యవసాయంలో పెస్ట్ మేనేజ్‌మెంట్‌ను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్న ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా అనే విప్లవాత్మక పురుగుమందును పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈసీ ఫార్ములేషన్‌గా రూపొందించబడిన, ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా దాని ప్రత్యేక కాంటాక్ట్, సిస్టమిక్, ట్రాన్స్‌లామినార్ లక్షణాల ద్వారా గొంగళి పురుగును సమగ్రంగా నియంత్రణను అందిస్తుంది. కీటకాల రూపాంతరాన్ని అడ్డుకోవడం ద్వారా, ఈ పరిష్కారం పంట నష్టాన్ని నివారించడమే కాకుండా కాలక్రమేణా స్థిరమైన ప్రభావాన్ని నిర్ధారిస్తుంది.
 
గొంగళి పురుగు యొక్క మూడు జీవిత దశలపై, అంటే గుడ్డు, లార్వా అలాగే పురుగు నియంత్రణను ఈ ఉత్పత్తి అందిస్తుంది. తద్వారా పొగాకు లద్దె పురుగు వంటి కష్టతరమైన పురుగు కోసం దీనిని తయారుచేయడం జరిగింది. ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా ఇప్పుడు క్రిస్టల్ అధీకృత పంపిణీదారు, రిటైల్ సేల్స్ పాయింట్‌లో 30ml, 150ml, 300ml, 1L. తరహా రకాల ప్యాకెట్ పరిమాణాలలో రైతులకు సరసమైన ధరలో అందుబాటులో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)