Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులకు డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు: కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- మహీంద్రా క్రిష్-ఇ భాగస్వామ్యం

రైతులకు డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు: కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- మహీంద్రా క్రిష్-ఇ భాగస్వామ్యం

ఐవీఆర్

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (22:38 IST)
భారతదేశపు సుప్రసిద్ద వ్యవసాయ పరిష్కారాల ప్రదాత కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ యొక్క ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్ఈఎస్) బిజినెస్ విభాగం, క్రిష్-ఇ, ఈరోజు కోరమాండల్ డ్రోన్ స్ప్రేయింగ్ సేవ, గ్రోమోర్ డ్రైవ్‌‌ను భారతీయ రైతుల వద్దకు తీసుకువెళ్ళటానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించాయి.  
 
ప్రస్తుతం ఏడు కీలక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న, గ్రోమర్ డ్రైవ్ యొక్క కార్యకలాపాలకు ఆర్ టిపిఓ శిక్షణ పొందిన పైలట్‌ల బృందం మద్దతు ఇస్తుంది. కోరమాండల్ యొక్క డ్రోన్ సేవలు విపణిలో ప్రత్యేకంగా ఉంచబడ్డాయి. డ్రోన్ సరఫరా, పైలట్ శిక్షణ, సేవా మద్దతు కోసం దాని అనుబంధ సంస్థ ధక్ష అన్ మ్యానెడ్ సిస్టమ్స్ మద్దతు ఇస్తుంది. ఈ ఏకీకరణ, ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో పోటీ పరంగా కోరమాండల్‌ను ముందు ఉంచుతుంది. రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచడం, విస్తృత వ్యవసాయ వాల్యూ చైన్‌కు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా మహీంద్రా యొక్క ఎఫ్ఈఎస్ అందించే ఇతర సాంకేతికత ఆధారిత వ్యవసాయ పరిష్కారాలతో పాటుగా ‘క్రిష్-ఇ ఖేతీ కే లియే యాప్’ ద్వారా ఈ సేవలను పొందేందుకు ఈ భాగస్వామ్యం మరిన్ని అవకాశాలను అందిస్తుంది.
 
ఎంఒయు సంతకం(నాన్ బైండింగ్) కార్యక్రమంలో, కోరమాండల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫర్టిలైజర్ బిజినెస్-శ్రీ అమీర్ అల్వీ మాట్లాడుతూ: “కోరమాండల్ యొక్క గ్రోమర్ డ్రైవ్ రైతులకు వ్యవసాయ పద్ధతుల కోసం అవసరమైన సామర్థ్యం, వ్యాప్తి మరియు సౌలభ్యం పరంగా గణనీయమైన పురోగతిని అందిస్తుంది. కోరమాండల్ యొక్క గ్రోమోర్ డ్రైవ్, మహీంద్రా క్రిష్-ఇ మధ్య నేటి ఎంఓయు(నాన్ బైండింగ్) డ్రోన్ స్ప్రేయింగ్‌ను రైతులకు అందుబాటులో ఉంచడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగ దృశ్యాన్ని మార్చే దిశగా మా ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
 
ఈ భాగస్వామ్యం ద్వారా రైతులకు ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం, ఉత్పాదకతను పెంచడం, వ్యవసాయ లాభదాయకతను మెరుగుపరచడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కోరమాండల్ యొక్క గ్రోమోర్ డ్రైవ్, కంపెనీ యొక్క అనుబంధ సంస్థ ధక్ష అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ మద్దతుతో, సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌లతో పాటు అంతర్గతంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక వ్యవసాయ డ్రోన్‌ల యొక్క ప్రయోజనాన్ని సైతం అందిస్తుంది. ఈ భాగస్వామ్యం, ఆవిష్కరణల పరంగా కొత్త అవకాశాలను తెరుస్తుందని, మా వాటాదారులకు విలువను సృష్టిస్తుందని, ముఖ్యంగా రైతుల జీవితాలపై సానుకూల, శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)