Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మలమ్మ పద్దు లెక్కల తర్వాత ధరల్లో తగ్గుదల - పెరుగుదల

Advertiesment
budget 2023

ఠాగూర్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (13:44 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసాలో పలు ప్రకటనలు చేశారు. ముఖ్యంగా, కొన్ని రకాలైన వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపు నిచ్చింది. ఇక కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 రకాల రక్షక టాబ్లెట్ల్, వెబ్ బ్లూ లెదర్, లిథియం బ్యాటరీలు ఉండగా, స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తులు కారు చౌకగా లభించనున్నాయి. ఈ బడ్జెట్ తర్వాత ధరలు తగ్గే వస్తు పరికరాల జాబితాను పరిశీలిస్తే, 
 
ఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు, ఎల్ఈడీ, ఎల్‌సీడీలు, లిథియం బ్యాటరీల స్క్రాప్, వెబ్ బ్లూ లెదర్, కోబాల్ట్ ఉత్పత్తులు, 36 ప్రాణ రక్షణ ఔషధాలు, జింక్, చేపల పేస్ట్‌పై సుంకం 30 నుంచి 5 శాతానికి తగ్గింపు, స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. 
 
అలాగే, ధరలు పెరిగే వస్తు ఉత్పత్తులను పరిశీలిస్తే, నిర్దేశిత టారిఫ్ ఐటమ్‌ల కింద కవర్ చేయబడిన అల్లిన బట్టలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 10/20 శాతం నుండి కిలోకు 20 లేదా రూ.115, ఏది ఎక్కువైతే అది పెరుగుతుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది విలోమ విధి నిర్మాణాన్ని సరిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అదనంగా, ఆర్థిక మంత్రి తాత్కాలిక మదింపు కోసం కాలపరిమితిని రెండేళ్లుగా నిర్ణయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?