Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

నవ్యాంధ్రలో ప్రపంచంలోనే అతిపెద్ద పేపర్ మిల్.. రామాయపట్నంలో?

Advertiesment
Andhra pradesh
, సోమవారం, 7 జనవరి 2019 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 3.5 బిలియన్లు అంటే దాదాపు రూ.24,500 కోట్ల విలువతో పేపర్ మిల్ ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇండోనేషియాకు చెందిన పల్ప్ అండ్ పేపర్ గెయింట్ ఏషియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ) సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద పేపర్ మిల్‌ కోసం ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.


ఐదు మిలియన్ల టన్నులను ఏడాదిలో ఉత్పత్తి చేసే పేపర్ మిల్లును రామాయపట్నంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. భారత్‌లో వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడిని నవ్యాంధ్ర ఆకర్షించింది. 
 
ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇప్పటికే 2,500 ఎకరాల సమీకరణ పూర్తికాగా, ప్లాంట్ పూర్తయితే 15వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. భారత్‌లో ఓ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదేనని ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈఓ జే కృష్ణ కిశోర్ తెలిపారు. 12 నెలల వ్యవధిలోనే ఈ ప్లాంటుకు అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. కాగా భారత్‌లో ఏపీపీ ప్లాంటు ఏర్పాటుపై భారత పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పండిట్ హర్షం వ్యక్తం చేశారు. గత నాలుగైదేళ్లుగా పేపర్ ఇండస్ట్రీ ముడి సరుకుల లభ్యత లేకుండా వుందని.. ఇలాంటి పరిస్థితుల్లో పేపర్ మిల్ ఏపీలో రావడాన్ని ఆయన స్వాగతించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ షెల్టర్‌లో అశ్లీల నృత్యాలు.. బాలికలను రేప్ చేసిన అతిథులు : సీబీఐ