తైవనీస్ టెక్నాలజీ సంస్ధ, అసుస్ నేడు తమ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించింది. షాప్‌విత్ అసుస్ ప్రచారం ద్వారా విడుదల చేసిన ఈ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందిన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఈ-స్టోర్‌కు ఆన్‌లైన్‌లో అగ్రగామి విక్రేతలలో ఒకరైన ఏవైఆర్ టెక్నాలజీస్ సేవలనందిస్తుంది. ఈ నూతన ఆన్‌లైన్ స్టోర్ ఇప్పుడు వినియోగదారులు, సాంకేతిక ప్రియులకు తమ అభిమాన అసుస్ ఉత్పత్తులను ఒక్క బటన్ క్లిక్‌తో పొందే అవకాశాన్ని అత్యంత సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచి పొందే అవకాశం అందిస్తుంది. వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడంతో పాటుగా బ్రాండ్‌కు సంబంధించిన సమాచారమంతా పూర్తిగా అందుబాటులో ఉంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
అసుస్ ఈ-స్టోర్, వినియోగదారులు తమకు నచ్చిన అత్యుత్తమ ఉత్పత్తులను సౌకర్యవంతంగా కొనుగోలు చేసేందుకు ప్రారంభించిన కార్యక్రమం. ఆర్‌ఓజీ (రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్) వ్యాప్తంగా అసుస్ యొక్క అత్యాధునిక ఉత్పత్తులు మరియు కన్స్యూమర్ పీసీ విభాగాలు నుంచి ఈ కొనుగోళ్లను జరుపవచ్చు. బ్రాండ్ యొక్క విస్తృత స్థాయి గేమింగ్ మరియు కన్స్యూమర్ ల్యాప్‌టాప్స్‌తో పాటుగా ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్లు- ఆర్‌ఓజీ ఫోన్ 5 మరియు ఆర్‌ఓజీ ఫోన్ 3 వంటివి తొలుత ఇక్కడ లభించనున్నాయి. ఈ ఆన్‌లైన్ స్టోర్ ఆవిష్కరణతో, వినియోగదారుల ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాలు మరింతగా సమగ్రమైన డిజిటజ్డ్ అనుభవాలతో వృద్ధి చేయనున్నారు.
ఈ ప్రకటన గురించి లియాన్ యు, రీజనల్ డైరెక్టర్-సిస్టమ్ బిజినెస్ గ్రూప్, అసుస్ ఇండియా మాట్లాడుతూ మీ వినియోగదారులకు మెరుగ్గా సేవలను అందించాలంటే ఓమ్నీ ఛానెల్ ఉనికి అత్యంత కీలకం. మా విస్తృత స్థాయి ఆఫ్‌లైన్ నెట్‌వర్క్ వినూత్నమైన అనుభవాలను వినియోగదారులకు అందించినప్పటికీ, మా ఆన్‌లైన్ విస్తరణ అనేది సౌకర్యవంతమైన షాపింగ్ కోసం వారికి సహాయపడనుంది. అసుస్ ఈ-స్టోర్ ఆవిష్కరణ అనేది ఈ దిశగా మేము వేసిన మరో ముందడుగు. ఇది అర్ధవంతమైన ఆవిష్కరణలతో వినియోగదారులకు సాధికారిత అందించాలనే బాండ్ యొక్క నిబద్ధతను ఇది శక్తివంతం చేయడంతో పాటుగా వారి డిజిటల్ ప్రయాణం మరింతగా వృద్ధి చేసే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. అసుస్ ఈ–స్టోర్ ఇప్పుడు వినియోగదారుల డిజిటల్ ప్రయాణం వృద్ధి చేయడంతో పాటుగా సౌకర్యవంతంగా తమ ఇంటి నుంచి వారి సాంకేతిక అవసరాలనూ తీర్చుకునేందుకు తోడ్పడుతుందిఅని అన్నారు.
ఈ ఈ-స్టోర్ విస్తృత శ్రేణి ఫీచర్లను అందిస్తుంది. ఇది వినియోగదారుల కొనుగోలు అనుభవాలను వీలైనంత సౌకర్యవంతంగా మారుస్తుంది. చెల్లింపుల అవకాశాలనూ సైతం సురక్షిత చెల్లింపు గేట్‌వే ద్వారా అందిస్తారు. ఇది అత్యంత సౌకర్యవంతమైన లావాదేవీల అనుభవాలను వినియోగదారులకు ఈ-పేమెంట్, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లు మరియు మరెన్నో వాటి ద్వారా అందిస్తుంది. అసుస్ కమ్యూనిటీ, వాటాదారులు, వినియోగదారుల యొక్క సంక్షేమానికి మరింతగా భరోసానందిస్తూ ఈ కంపెనీ భౌతిక దూర నియమాలను అనుసరిస్తూ కాంటాక్ట్‌లెస్ డెలివరీని అసుస్ ఈ-స్టోర్ వద్ద తీసుకునే ఆర్డర్లకు అందిస్తుంది. అదనంగా, ఈ ఆర్డర్లకు డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి ఎలాంటి సంతకాలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగానే వినియోగదారులకు తగిన సమాచారం అందించి ప్యాకేజీని వారి ఇంటి ముంగిట వదిలి వేస్తారు. సురక్షిత దూరం మౌఖికంగా నిర్థారణ చేసుకోవడం ద్వారా ఒకరి సంతకం అవసరం ఉండదు.
ఆయుషీ కిశోర్, డైరెక్టర్, ఏవైఆర్ టెక్నాలజీస్ ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, మదర్ బోర్డులు, పీసీలు, మానిటర్స్, గ్రాఫిక్ కార్డులు మరియు రౌటర్లకు అత్యంత ప్రాచుర్యం పొందిన సుప్రసిద్ధ బ్రాండ్‌లలో ఒకటైన అసుస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో అసుస్ యొక్క విస్తృతశ్రేణి ఉత్పత్తులను అందించడంతో పాటుగా ఈ-సేవలను ఏవైఆర్ టెక్నాలజీస్ అందిస్తుంది. ఈ భాగస్వామ్యం, అసుస్ ఉనికిని మరింతగా వృద్ధి చేసేందుకు మరియు దేశవ్యాప్తంగా మా వినియోగదారుల ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు తోడ్పడనుంది అని అన్నారు.