Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ 2021 రెండవ త్రైమాసంలో 19.8 కోట్ల నిఖరలాభం ఆర్జన

ఆసియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ 2021 రెండవ త్రైమాసంలో 19.8 కోట్ల నిఖరలాభం ఆర్జన
, శుక్రవారం, 13 నవంబరు 2020 (20:24 IST)
భారతదేశంలో అతిపెద్ద టైల్స్‌ బ్రాండ్‌లలో ఒకటైన ఆసియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ (ఏజీఐఎల్‌),సెప్టెంబర్‌ 2020తో ముగిసిన త్రైమాసానికి ఆర్ధిక ఫలితాలను వెల్లడించింది. 2021 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసంలో మొత్తంమ్మీద 344.3 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపితే, దాని పై 41.8 కోట్ల రూపాయల ఎబిట్డా సాధించినట్లుగా కంపెనీ వెల్లడించింది. ఈ త్రైమాసంలో టైల్స్‌ విభాగం దేశీయంగా మాత్రమే గాక ఎగుమతుల పరంగా కూడా బలీయమైన వృద్ధిని నమోదు చేసింది.
 
ఈ ఫలితాలు మరియు ప్రదర్శన గురించి శ్రీ కమలేష్‌ పటేల్‌, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘ఈ ఆర్ధిక సంవత్సరపు రెండవ త్రైమాసం ముగిసినవేళ, కంపెనీ పనితీరు కోవిడ్‌ ముందస్తు కాలంలా ఉందని వెల్లడించడానికి సంతోషిస్తున్నాము. ప్రభావవంతమైన వ్యూహాలు కారణంగానే ఇది సాధ్యమైంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా భారతీయ సెరామిక్‌ పరిశ్రమ లబ్ధి పొందింది. ఈ ఫలితంగానే, భారీ సంస్థలు తమ ప్లాంట్‌ల సామర్థ్యం వృద్ధి చేసుకుంటున్నాయి. దీనికి తోడుదేశీయంగా గ్యాస్‌ ధరలు తగ్గడం, యాంటీ చైనా సెంటిమెంట్‌ కూడా ఈ పరిశ్రమకు కలిసి వచ్చింది. రాబోయే త్రైమాసాలలో స్ధిరంగా వృద్ధి కొనసాగించగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
అంతర్జాతీయ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటుగా ఎగుమతులు వృద్ధి చేయడానికి ఈ కంపెనీ ఇటీవలనే ఏజీఎల్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ను మార్బి వద్ద 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించింది. శ్రీ పటేల్‌ మరింతగా చెబుతూ ‘‘గ్రామీణ మరియు టియర్‌ 2 నగరాలలో  ఉనికిని చాటడంతో పాటుగా మధ్య తరగతి కోసం విలువ ఆధారిత ఉత్పత్తులను సృష్టించడంపై లక్ష్యం చేసుకుంది. రాబోయే త్రైమాసాలలో కంపెనీ నూతన ప్రమాణాలతో కూడిన వృద్ధి దిశగా పయనించడంతో పాటుగా వినియోగదారులకు సేవలను అందించనుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైవేపై అడ్డంగా ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్...