Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్ మన్మోహన్ సింగ్ ... ఓ అరుదైన ఆణిముత్యం : గౌతం అదానీ

Advertiesment
manmohan singh

ఠాగూర్

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (09:45 IST)
భారతదేశ నేతల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ అరుదైన ఆణిముత్యం అని ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. మన్మోహన్ మృతిపై ఆయన ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. భారతదేశాన్ని పునర్నిర్మించిన, ప్రపంచానికి తలుపులు తెరిచిన పరివర్తనాత్మక 1991 సంస్కరణల్లో ఆయన కీలక పాత్రను చరిత్ర ఎన్నటికీ గౌరవిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. 
 
మృదువుగా మాట్లాడి, తన చర్యల ద్వారా స్మారక పురోగతిని సాధించిన అరుదైన నాయకుడు అని అదానీ కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం, వినయం అనేవి దేశానికి సేవ చేయడంలో మాస్టర్ క్లాస్‌గా మిగిలిపోతాయన్నారు. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 
 
డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి తన మేధస్సు, దయ, సమగ్రతతో భారతన్ను ఆధునిక ఆర్ధిక దేశంగా తీర్చిదిద్దారు. ఆయన మాటల కంటే చేతల్లో చూపించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. 
 
డాక్టర్ మన్మో హన్ సింగ్‌కు వీడ్కోలు. మీరు ఈ దేశాన్ని ప్రేమించారు. దేశానికి మీరు అందించిన సేవలు సుదీర్ఘకాలం గుర్తుండిపోతాయి అని మహీంద్రా గ్రూప్ చైర్మన్  ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. 
 
మన్మోహన్ సింగ్ వివేకవంతమైన ఆర్థికవేత్త. గొప్ప సమగ్రత కలిగిన వ్యక్తి. తన సంస్కరణలతో భారత్‌ను తిరిగి ప్రగతిబాట పట్టించినందుకు గాను మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాం అని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. 
 
మన్మోహన్ సింగ్ గొప్ప శ్రోత, ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ, ఆయన మాట్లాడినప్పుడల్లా సారాంశం మాత్రమే మాట్లాడేవారు అని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు : రాష్ట్రపతి ముర్ము