Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహీంద్రా థార్ రాక్స్‌ ఫోర్ వీల్ డ్రైవ్ - ఫీచర్లు ఇవే...

TharROXX

ఠాగూర్

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (10:21 IST)
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మరో కొత్త రకం కారును ప్రవేశపెట్టారు. మహీంద్రా థార్ రాక్స్ ఫోర్ వీల్ డ్రైవ్‌ను విడుదల చేసింది. ఈ వాహనాన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన కంపెనీ.. ఆ కారు ధరలను వెల్లడించారు. థార్ రాక్స్ పేరుతో ఈ కంపెనీ భారత మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్ (ఆర్‌ డబ్ల్యూ డి) ధరలు మాత్రమే వెల్లడించింది. 
 
కాగా, ప్రస్తుతం మహీంద్రా థార్ రాక్స్ 4 x 4 వేరియంట్‌‍ల ధరలను వెల్లడించింది. దీని టీమ్స్ ప్రారంభ ధర రూ.18.79 లక్షలు (ఎక్స్ షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. 4 x 4 కాన్ఫిగరేషన్‍‌లో కేవలం డీజిల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది మ్యాన్యువల్ గేర్ బాక్స్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ 152 హెచ్.పి మరియు 330 ఎన్ఎం పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ 370 ఎన్ఎం టార్క్ 175 హెచ్.పి. పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 
 
మహీంద్రా థార్ ఆర్వో xx 4x4 వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్ షోరూం)
మహీంద్రా థార్ రోక్స్ ఎంx5ఎంటీ రూ.18.79 లక్షలు 
మహీంద్రా థార్ రోక్స్ ఏx5ఎవ్ ఏటీ రూ.20.99 లక్షలు 
మహీంద్రా థార్ రోక్స్ ఏx7ఎవ్ ఎంటీ రూ.20.99 లక్షలు 
మహీంద్రా థార్ రోక్స్ ఏx7ఎల్ ఏటీ రూ.22.49 లక్షలు 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలక్ష్మిని హత్య చేశాడు.. ఫ్రిజ్‌లో కుక్కిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా?