రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఇది అందని ద్రాక్షలుగా మారుతోంది. మంగళవారం పదిగ్రాముల బంగారం ధర 15,200 రూపాయలకు చేరుకుంది. ఇదే బంగారం ఆరు నెలల క్రితం రూ. 11 వేలుగా వుండింది.ప్రస్తుతం అదే బంగారం పదిహేను వేలకు పైమాటగానే పలుకుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అర్థికమాంద్యం ఉన్న కారణంగా డిమాండ్ పెద్దగా లేకపోవడంతో దిగుమతి లేనప్పటికీ, దేశీయ అవసరాలకు అనుగుణంగా నిల్వలున్నాయి. ఐతే ప్రస్తుతం ఎక్కడ చూసినా పెండ్లి సందడులు నెలకొనడంతో డిమాండ్ మరింతగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కాగా బంగారం ఎగుమతులపై అనేక దేశాలు పన్ను రెట్టింపు చేయడం వల్లకూడా డిమాండ్ ఏర్పడిందని వ్యాపార విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.