Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరుత్సాహపరచిన జులై నెల దేశీయ ఎగుమతులు!

Advertiesment
దేశీయ ఎగుమతులు
జులై నెలలో దేశీయ ఎగుమతలు ఆశించినంత వృద్ధిని సాధించలేకపోయాయి. మేజర్ మార్కెట్‌లైన అమెరికా, యూరప్ వంటి దేశాలు ఇంకా ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో దేశం ప్రోత్సాహకర ఎగుమతులను నమోదు చేసుకోలేకపోయింది. ఏదేమైనా జులై నెలలో మొత్తం ఎగుమతులు మాత్రం 13.2శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.

మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసానికి గానూ 30శాతం వృద్ధిని సాధించాయి. అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై 2009లో ఎగుమతులు 14.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. జులై 2010లో ఎగుమతులు 16.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ఇకపోతే.. దిగుమతులు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది జులైలో 21.72 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు 34.3శాతం వృద్ధితో 27.17 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఫలితంగా గత ఏడాది 7.38 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 12.93 బిలియన్ డాలర్లకు పెరిగింది.

చమురు దిగుమతులు 4.4శానికి పెరిగి 7.66 బిలియన్ డాలర్లను తాకాయి. చమురేతర(నాన్ ఆయిల్) దిగుమతులు 49.6శాతానికి పెరిగి 21.50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu