జూన్ నెలలో భారత్ ఎగుమతులు దూసుకుపోయాయి. పశ్చిమ దేశాల మార్కెట్లో డిమాండ్ పెరిగిన దృష్ట్యా జూన్ నెల ఎగుమతులు గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 46.4 శాతం వృద్ధితో 29.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 42.4 శాతం వృద్ధి చెంది 36.9 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా ఈ నెల వాణిజ్య లోటు 7.7 బిలియన్ డాలర్లు.
29.2 బిలియన్ డాలర్ల ఎగుమతి గణాంకాలు చాలా చాలా ఎక్కువగా వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ పేర్కొన్నారు. 2011-12 ఏప్రిల్-జూన్ కాలంలో ఎగుమతులు క్రితం సంవత్సరంతో పోలిస్తే 45.7 శాతం పెరిగి 79 బిలియన్ డాలర్లు జరుగగా, దిగుమతులు 36.2 శాతం వృద్ధితో 110.6 బిలియన్ డాలర్లకు ఎగసినట్లు ఖుల్లర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్య లోటు 31.6 బిలియన్ డాలర్లు.