Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘాటెక్కిన ఉల్లి: కొనలేక వినియోగదారుడు లొల్లి

Advertiesment
ఉల్లిపాయల ధరలు
PTI Photo
PTI
మార్కెట్‌లో ఉల్లి ధరలు లొల్లి చేస్తున్నాయి. మొన్నటి వరకూ కేజీ 15 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా 50 శాతానికి పైగా పెరిగి.. కేజీ ఉల్లిపాయల ధర రూ. 30-40 మధ్య అమ్ముడవుతోంది. దీంతో వినియోగాదారులు ఉల్లి ధరలపై లొల్లి ప్రారంభించారు. అన్ని స్థానిక మార్కెట్లతో పాటు మెట్రో నగరాల్లో కూడా ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

సాధారణంగా ఈ సీజన్ ఉల్లి ధరలు పెరగడం సామాన్య విషయమే అయినప్పటీ ఈ స్థాయిలో పెరగడం మాత్రమ అసామాన్య విషయమే. హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు విపరీతంగా పెంచడంతో అవి కాస్తా రీటైల్ మార్కెట్లకు వచ్చే సరికి తడిసి మోపెడవుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని అమ్మకపుదారులు కూడా తమ ఇష్టం వచ్చిన రేటుకు విక్రయిస్తున్నాయి.

రాష్ట్ర మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ. 30-35 మధ్య లభిస్తుంటే.. అదే సూపర్ మార్కెట్లలో రూ. 40 వరకూ పలుకుతోంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు సంభవించడంతో ఖరీఫ్ దిగుబడిలో నష్టం సంభవించడంతో పాటు కొంత మేర జాప్యం కూడా కలుగుతుంది. దీంతో వేసవి కోసం స్టోర్ చేసి ఉంచిన ఉల్లిపాయలను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే దీనికి డిమాండు ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెంచక తప్పలేదని మార్కెట్లు అంటున్నాయి.

కాగా.. మార్కెట్‌లో కొత్తగా ఉల్లిపాయలు రావడానికి మరో 15-20 రోజుల వరకూ సమయం పడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకూ ఉల్లిపాయల కొనుగోలుదారుల కళ్లల్లో నీళ్లు తప్పవని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu