Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇనుము ధరలను పెంచనున్న టాటా స్టీల్

Advertiesment
టాటా స్టీల్
ప్రపంచ ఇనుము ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉన్న టాటా స్టీల్ సంస్థ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి సరుకుల ధరలు పెరగండం వల్ల ఉత్పాదకాల వ్యయం పెరిగిపోతుందని, అందువల్ల ధరలను పెంచుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలసుబ్రమన్యం ముత్తురామన్ తెలిపారు.

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఇనుము ఉత్పత్తులకు గిరాకీ పెరిగందని, చవకగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి ఇనుము కూడా అవసరానికి మించిన సామర్ధ్యాన్ని కలిగి ఉండటంతో పెద్ద సవాలుగా మారిందని ముత్తురామన్ అన్నారు.

అయితే.. ఎంత పరిమాణంలో ధరలు పెంచుతామనేది మరియు ఈ పెంపు ఎప్పటి నుండి అమలులోకి వస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.

Share this Story:

Follow Webdunia telugu