ఆహార ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరిగిపోతున్న కారణంగా ఆహార పదార్థాలపై రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణ పెరుగుదలకు బ్రేక్ వేసే దిశగా ఆహార పదార్ధాలైన పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల నిల్వలకు పెద్ద పీట వేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇందులో భాగంగా ఆహార పదార్థాలు, వ్యవసాయోత్పత్తులను నిల్వచేసే కోల్డ్ స్టోరేజి, సరఫరా చేసే కంపెనీలకు బడ్జెట్‌లో భారీ ఎత్తున రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థిక శాఖకు సమర్పించే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు.
అలాగే ఆహార పదార్థాల నిల్వ, సరఫరా, కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేసే రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఆహార పదార్థాలు వృథా కాకుండా, సమర్ధవంతంగా పంపిణీ చేసే రంగాలకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి’ అని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.