దేశీయ నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ ఇటీవలే అమెరికా విడుదలై సంచలనం సృష్టించిన ఆపిల్ ఐఫోన్-4ను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోగా ఈ ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈఓ(ఇండియా, దక్షిణ ఆసియా) సంజయ్ కపూర్ తెలిపారు.
కాగా.. భారతి ఎయిర్‌టెల్ జూన్ నెలలో 30లక్షల మంది వినియోగదారులను కొత్తగా చేర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్ మొత్తం చందాదారుల సంఖ్య 13.66 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.