అద్దె ఇంట్లో ఉండే వారికి మినహాయింపు రూ.24 నుంచి రూ.60వేలకు పెంపు!
ద్రవ్య లోటు 3.5, రెవెన్యూ లోటు 2.5 శాతం : అరుణ్ జైట్లీ ప్రకటన
అద్దె ఇంట్లో ఉండే వారికి అద్దె మినహాయింపు రూ.24 నుంచి రూ.60వేలకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఒక్కరోజులోనే స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించేలా చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యలోటు 3.5 శాతంగా నమోదైందన్నారు.
రెవెన్యూ లోటు 2.5 శాతమని జైట్లీ వెల్లడించారు. పంటల బీమా పథకాలకు నిధులను రెట్టింపు చేశామని ప్రకటించారు. 9 సూత్రాల ఆధారంగా పన్ను మినహాయింపును ప్రకటించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో పోస్టాఫీసుల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇకపై పాత్రికేయులకు బడ్జెట్ హార్డ్ కాపీల పంపిణీకి ప్రభుత్వం స్వస్తి పలికింది. పార్లమెంట్, ఎన్‌ఎంసీలలో ఈసారి ఇవి అందుబాటులో ఉండవు. అటవీ శాఖ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. గృహరుణాలపై వడ్డీ మినహాయింపు మరో రూ.50వేలు పెంచినట్లు జైట్లీ వెల్లడించారు.