Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విక్స్ వాపర్ రబ్‌తో గోళ్ల ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టండి.

Advertiesment
Nails infection
, శనివారం, 5 జులై 2014 (17:52 IST)
విక్స్ వాపర్ రబ్‌తో గోళ్ల ఇన్ఫెక్షన్‌కు చెక్‌కా ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. మహిళలు పనుల్లో పడి గోళ్లపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోతారు. దీంతో గోళ్ల ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదముంది. ఒకవేళ గోళ్ళ ఇన్ఫెక్షన్ సోకితే... ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి సింపుల్ చిట్కాలు పాటించవచ్చు. 
 
మీరు ఇన్ఫెక్షన్ అయిన గోళ్ళ మొత్తానికి విక్స్ వాపర్ రబ్‌ను అప్లై చేయవచ్చు. తర్వాత సాధారణ గాలిలో ఆరనివ్వాలి . ఇంకా మీరు బ్యాండ్ ఎయిడ్‌ను కూడా ఉపయోగించవచ్చు . దీన్ని రోజుకు రెండు సార్లు ప్రయత్నించవచ్చు. ఇలా చేస్తే గోళ్ళ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది. 
 
అలాగే సాల్ట్ వాటర్‌లో మీ పాదాలను ఉంచడం ద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. మీరు సముద్రనీటికి దగ్గరలో జీవిస్తున్నట్లైతే ఆనీటిలో కాళ్ళను కొంచెం సేపు డిప్ చేయాలి. నెయిల్ ఫంగస్ మరియు బ్యాక్టీరియా నివారించడానికి సాల్ట్ వాటర్ ఒక నేచురల్ హోం రెమెడీ. ఇంకా వేపనూనెలో యాంటిఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేపనూనె నెయిల్ ఫంగస్‌ను నివారించడానికి సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu