Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లగా ఉన్నారా? ఇవిగోండి కొన్ని టిప్స్!

Advertiesment
Tips for beauty skin and white skin
, బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:51 IST)
మనం తీసుకునే ఆహారమే చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా వుండడానికి పలు ఆహారపదార్థాలు తోడ్పడతాయి. నూనె పదార్ధాలు, కొవ్వు పెంచే పదార్ధాలు, మత్తు పదార్ధాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వాటికి దూరంగా వుండాలి. 
 
ఇక ఆకుకూరలు, పళ్లు, పాలు, మొక్కజొన్న, సోయాచిక్కుళ్లు వంటివి తరచు తీసుకోవడం చర్మానికి మంచిది. ఇంకా సహజసిద్ధంగా ఇంట్లో వుండే సున్నిపిండి, సెనగపిండి, పాలు, కమలా, బొత్తాయి తొక్కల పౌడరు లాంటివి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. 
 
సబ్బు కన్నా వివిధ సహజ మూలికలతో తయారుచేసిన సున్నిపిండి వాడడం మంచిది. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి, నిత్యం కాస్సేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా, కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై వుండాలి. 
 
నిత్యం వీలైనంత ఎక్కువగా నీరు సేవించాలి. ఇది కేవలం చర్మానికే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. చెమట ఎక్కువగా పట్టే వారు, స్నానానంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి, పల్చగా చేసి, వంటికి పట్టించడం మంచిది. అత్తరులు, ఫెర్ఫ్యూమ్స్ కన్నా ఇది మంచిది. నూనె పదార్ధాలకు దూరంగా వుంటే ముఖంపై చర్మం కాంతివంతంగా వుంటుంది. జిడ్డు చేరదు. జిడ్డు చర్మం కలిగిన వారు రోజుకు నాలుగైదు సార్లు, స్వచ్చమైన మంచి నీటితో ముఖాన్ని కడగడం అవసరం.
 
నిమ్మ రసంతో మోచేతులు, మోకాళ్ల వద్ద రుద్దితే నల్లటి చారలుండవు. ఇలా వారానికి రెండుసార్లైనా చేయాలి. అలాగే ఒక టీస్పూను కొబ్బరి నూనెకి, అర టీ స్పూను నిమ్మరసం కలిపి జాయింట్ల దగ్గర రుద్ది, వేడి టవల్‌తో తుడిచేయాలి. ఇలా ప్రతీ వారము చేయాలి .
 
కొబ్బరి నూనెకి వాల్‌నట్‌ పొడిని కలిపి తరచూ రాస్తున్నా మంచి ఫలితమే ఉంటుంది. మీగడకి, పసుపు కలిపి స్క్రబ్‌లా రోజూ వాడొచ్చు. చర్మము నలుపు తగ్గి నునుపు అగును. రెండు స్పూన్ల పెరుగుకి కొంచెం బాదం పొడిని కలిపి రాసుకున్నా చర్మం తెల్లగానూ, మృదువుగా తయారవుతుంది.  
 
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ కచ్చితంగా ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.
 
మూడు స్పూన్ల బొరాక్స్‌ పొడికి, రెండు స్పూన్ల గ్లిజరిన్‌, రెండు స్పూన్ల రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మోకాలికీ, మోచేతులకీ రాసుకుని పావుగంట ఆగి, వేడి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నలుపు తగ్గి చర్మం నునుపు తేలుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనకు టీ స్పూను పంచదార, అరస్పూను జొన్నపిండి కలిపి దానిని గరుకుగా ఉన్న చోట రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu