ఆ విషయంలో స్త్రీల కంటే మగాళ్లే ఆరాటపడుతున్నారు... ఎండాకాలంలో....
ఒక వ్యక్తి అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడంలో కురులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మామూలుగా స్త్రీలు తమ శిరోజాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. శిరోజాలకు ఏదైనా సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీల కంటే ఎక్కువగా మగవారే జుట్టు క
ఒక వ్యక్తి అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడంలో కురులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మామూలుగా స్త్రీలు తమ శిరోజాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. శిరోజాలకు ఏదైనా సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీల కంటే ఎక్కువగా మగవారే జుట్టు కోసం ఆరాటపడుతున్నారు. కాలుష్యం, ఒత్తిడి కారణం ఏదైనా మగవారిలో కూడా జుట్టు రాలిపోయే సమస్య నానాటికీ పెరిగిపోతుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువ పట్టడం వలన జుట్టు జిడ్డుబారి పోతోంది కదా అని ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం మంచిది కాదు.
మీరు కావాలాంటే షాంపూ వాడకుండా కేవలం నీటితో తలస్నానం చేయవచ్చు. తడిగా ఉన్న జుట్టును దువ్వకూడదు, ఎందుకంటే ఆరిన జుట్టుతో పోలిస్తే తడిగా ఉన్నప్పుడు జుట్టు బలహీనంగా ఉంటుంది, కనుక కుదుళ్లు వదులైపోయి జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తలస్నానం చేసిన తర్వాత కొంత నీటిలో నిమ్మరసం పిండి ఆ నీటిని కుదుళ్లు మరియు జుట్టు మొత్తం తడిసేలా పోసుకుంటే మీ జుట్టు తాజాగా మరియు మెరిసిపోతూ ఉంటుంది. ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే జుట్టుకు తగిన సంరక్షణను అందిస్తే కొంతలో కొంతైనా జుట్టు రాలకుండా లేదా పొడి బారకుండా నివారించవచ్చు.