Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముల్తానీ మట్టితో క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ కలిపి రాసుకుంటే?

ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్‌తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఇదీ ఒకటి. ముల్తానా మట్

ముల్తానీ మట్టితో క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ కలిపి రాసుకుంటే?
, శుక్రవారం, 27 జనవరి 2017 (11:32 IST)
ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్‌తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఇదీ ఒకటి. ముల్తానా మట్టి, రోజ్ వాటర్, గంధం పొడి సమాన మొత్తాలలో తీసుకుని కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. సహజంగా ఆరిపోయిన అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 
 
పొడి చర్మం ఉన్న వారు మట్టిలో చెంచా తేనె, ఒక చెంచా బాదం నూనె, అర చెంచా మీగడ, గులాబీ నీరూ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పూర్తిగా ఆరకుండానే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అందిస్తుంది.
 
ముల్తానా మట్టి, క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చల మీద రాయాలి. 20 నిమిషాల అనంతరం శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకసారి..లేదా రెండుసార్లు చేస్తే మచ్చలు దూరమవుతాయి.
 
చర్మం సాగినట్లు అనిపిస్తున్న వారికి అరకప్పు ముల్తాని మట్టి, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఓట్స్, రెండు చెంచాల టమాటా గుజ్జులను తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నింటినీ మెత్తగా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఓ పావు గంట ఆగిన తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖానికి బాదం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలుసా...!