వేసవిలో చర్మానికి మేలు చేసే బాదం నూనె.. పెసరపిండితో ప్యాక్ వేసుకుంటే..?
బాదం నూనెను రోజూ వాడితే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. కొందరు వయస్సు కంటే పెద్దగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బాదం నూనెను ఉపయోగిస్తే నవయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలను దూరం
బాదం నూనెను రోజూ వాడితే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. కొందరు వయస్సు కంటే పెద్దగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బాదం నూనెను ఉపయోగిస్తే నవయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు మాయమవుతాయి. అలాగే పావుకప్పు బాదం నూనెలో రెండు చెంచాల పెసరపిండి కలుపుకోవాలి. దీన్ని చర్మానికి పట్టించి ప్యాక్‌లా వేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా కనిపిస్తుంది.
అలాగే బాదం నూనెను ఎండ వల్ల కమిలిన చర్మానికి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నలుపుదనం తగ్గుతుంది. జిడ్డుగా ఉండే ఈ నూనెను పొడిబారి గరుకుగా ఉండే చర్మానికి, కాలి పగుళ్లకు రాస్తే మంచి మార్పు కనిపిస్తుంది. ఇంకా చర్మానికి స్నానానికి ముందు రాసుకుంటే.. ఇందులోని పోషకాల ద్వారా తేమ లభిస్తుంది. కంటికి కిందటి నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. కొద్దిగా బాదంనూనెను రాసుకుని మృదువుగా మర్దన చేసుకుంటే సరిపోతుంది.