అరటిపండు గుజ్జును పాదాల పగుళ్లకు రాసుకుంటే?
పాదాలకు పగుళ్ల సమస్య కూడా ఒకటి. పగిలిన పాదాలు చూడడానికి ఇబ్బంది కరంగా ఉంటాయి. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తాయి.ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి
పాదాలకు పగుళ్ల సమస్య కూడా ఒకటి. పగిలిన పాదాలు చూడడానికి ఇబ్బంది కరంగా ఉంటాయి. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తాయి.ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
కొవ్వొత్తి మైనాన్ని ఆవనూనెలో కలుపుకుని రాత్రివేళ పాదాల పగుళ్లపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. గ్లిజరిన్‌ను రోజ్‌వాటర్‌లో కలుపుకుని ప్రతిరోజూ రాత్రివేళ పడుకునేముందు పాదాల పగుళ్లపై రాసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. నిద్రించే ముందు పాదాలకు నువ్వులనూనెతో మర్దన చేసుకోవాలి.
ఇలా చేయడం వలన పగుళ్ల త్వరగా మానిపోతాయి. అరటిపండు గుజ్జును కూడా పగుళ్ల రాసుకుంటే మంచిది. పసుపు, తులసి, కర్పూరం సమాన మోతాదులో తీసుకుని ఇందులో కలబంద గుజ్జును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లకు రాసుకుంటే మంచిది ఫలితం ఉంటుంది.